E-Paper
Advertisement

కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!

కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే.. ఇక్కడ అడ్డంకులు ఎందుకు: ఎన్వీ సుభాష్!
Advertisement

Modi Visit: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 10వ తేదీన తెలంగాణకు ప్రధాని మోడీ రావడం అభివృద్ధికి పండుగ లాంటిదని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన వస్తున్నారంటే రూ.వేల కోట్ల అభివృద్ధిని మూటగట్టుకొని వస్తారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ. 7,823 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారని సుభాష్ తెలిపారు. ఇది తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే మరో పెద్ద స్టెప్ అని కొనియాడారు. మోడీ రాకతో వరంగల్ నేతన్నలకు గ్లోబల్ గుర్తింపు దక్కనుందని వెల్లడించారు. నాడు కాకతీయుల కళా వైభవానికి నిలయమైన వరంగల్ గడ్డ, ఇప్పుడు టెక్స్‌టైల్ పవర్‌హౌస్‌గా మారబోతోందన్నారు. రూ.1,695 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ‘పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తున్నారన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్ రూపంలో..

ఇకపోతే బీబీనగర్ ఎయిమ్స్.. పేదలకు కొండంత అండగా నిలుస్తోందన్నారు. పైసలు లేక వైద్యం అందడం లేదని ఏ పేదవాడు రంది పడొద్దన్నదే మోదీ సంకల్పమని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ రూపంలో రూ.2,000 కోట్లతో ఒక అద్భుతమైన దవాఖానాను కేంద్రం నిర్మించిందని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో రూ.వేలకు వేలు గుంజే టెస్టులు ఇక్కడ రూ.వందల్లోనే పూర్తవుతాయన్నారు. కేవలం పది రూపాయలకే పెద్ద డాక్టర్లు వైద్యం అందించే సదుపాయం కూడా ఉందన్నారు. ఇది పేద ప్రజల ప్రాణం నిలబెట్టే దేవాలయం లాంటిదన్నారు. వీటితో పాటు తెలంగాణ నలుమూలలా అభివృద్ధి జరగనుందని సుభాష్ వెల్లడించారు. నరేంద్ర మోడీ సర్కార్ హయాంలో తెలంగాణ రైల్వేలకు వేలకోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కాజీపేట-విజయవాడ లైన్లు, కొత్త స్టేషన్లతో కనెక్టివిటీ పెరుగుతోందన్నారు.

Advertisement

Also read: గద్వాల్లో బెల్ట్ షాపుల జోరు యువత బేజారు.. పట్టించుకోని అధికారులు

జహీరాబాద్ స్మార్ట్ సిటీతో ..

మహబూబ్‌నగర్ జాతీయ రహదారి పనులు, మల్కాపూర్ పెట్రోలియం టర్మినల్, సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ.. ఇలా ఏ రంగం చూసినా కేంద్రం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. జహీరాబాద్ స్మార్ట్ సిటీతో మరో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. కేంద్రం వేల కోట్లు ఇస్తుంటే, ఇక్కడి కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన సూచించారు. డీలిమిటేషన్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసని, అభివృద్ధి ఎక్కడ ఉంటే మద్దతు అక్కడే ఉంటుందని రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఓటు శాతమే సాక్ష్యమని సుభాష్ పేర్కొన్నారు.

Advertisement

Also read: ఇకనైనా కళ్లు తెరవండి బాబూ.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రికార్డులు బ్రేక్..!

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×