E-Paper
Advertisement

ఏడాది తర్వాత ఓటీటీలోకి బర్నింగ్ స్టార్.. సంపూ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఏడాది తర్వాత ఓటీటీలోకి బర్నింగ్ స్టార్.. సంపూ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Sodara OTT :సంపూర్ణేశ్ బాబు…ఇప్పుడంటే కాస్త జోష్ తగ్గింది కాని ‘హృదయ కాలేయం’సినిమా రిలీజ్ అయినప్పుడు ఇతగాడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అలా స్పూఫ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌ అయిన సంపూ దాదాపు 20 సినిమాలు చేసుకుపోయాడు కూడా.కాని మధ్యలో వచ్చిన ‘కొబ్బరిమట్ట’ తప్ప మరో సినిమా అతనికి మెమరబుల్ కాలేకపోయింది.అయితేనేం ప్రస్తుతం వరుస సినిమాలని లైన్లో పెట్టిన సంపూ న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ లో ‘బిర్యానీ’ అనే వెరైటీ రోల్ చేస్తుండటం విశేషం.

రిలీజ్ అయిన ఏడాది తర్వాత

Advertisement

ఇక ఇవన్ని ఇలా ఉంటె తాజాగా సంపూ లీడ్ రోల్ నటించిన ‘సోదరా’ అనే సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత సైలెంట్ గా ott లోకి వచ్చేందుకు రెడీ అయిపొయింది. బ్రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా సంపూ,సంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పోయినేడు ఏప్రిల్ 25న థియేటర్ లోకి వచ్చి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇక అందరూ మర్చిపోయారు అనుకున్న ఈ సినిమా ఇపుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకుంది. అవును ..క్రేజీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహలో మే1 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.

also read :యశ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. మళ్ళీ వాయిదా పడనున్న ‘టాక్సిక్’? 250 కోట్ల డీలే కొంపముంచుతోందా!

Advertisement

ఇద్దరు అన్నా దమ్ములు- ఒక ఆ అమ్మాయి

సినిమా కథ విషయానికి వస్తే తెలంగాణలోని ఒక పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్)అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు.చిరంజీవి ఫ్యామిలీ ఆ ఊర్లో సోడా బిజినెస్ చేస్తుంటుంది.చిరు కి ఏజ్ బార్ అవుతున్న ఇంకా పెళ్లి కాదు,అదే సమయంలో ఎదురింట్లో దివి (ఆర్తి గుప్తా) దిగుతుంది. అయితే అన్నా దమ్ములు ఇద్దరు ఆ అమ్మాయినే ప్రేమించడంతో కథ రసవత్తరంగా సాగుతుంది. తను ప్రేమించిన అమ్మాయినే తమ్ముడు ప్రేమిస్తున్నాడు అని తెలుసుకున్న చిరంజీవి తమ్మున్ని వేరే ఊరికి పంపిస్తాడు.కాని దివి ప్రేమని మాత్రం గెలుచుకోలేకపోతాడు. మరో వైపు తమ్ముడు పవన్ కాలేజీలో భువి (ప్రాచీ బన్సాల్)ని ఇష్టపడతాడు.ఇక హాలీడేస్ కి ఇంటికి వచ్చిన పవన్ కి చిరుకి మధ్య గొడవలు మొదలవుతాయి. మరి ఈ మనస్పర్థలను వీరు ఎలా దాటారు? చివరకు చిరంజీవికి పెళ్లి అయ్యిందా లేదా? అన్నది సినిమా కథ.

కామెడీని ఇష్టపడే వారికి  మాంచి ఎంటర్ టైనర్

సంపూ మార్క్ కామెడీని ఇష్టపడే వారికి ఈ సోదరా సినిమా మాంచి ఎంటర్ టైనర్ అని చెప్పవచ్చు, ఇక వీరితో పాటు బాబు మోహన్, కళ్యాణి కృష్ణన్ లాంటి సీనియర్ నటులు కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించడం విశేషం.మరి సంపూ సోదరాని థియేటర్లో మిస్ అయినవారు ఆహాలో చూసేసి ఎంజాయ్ చేసేయండి .

also read :కరాటే క్వీన్ టు ఐటమ్ బాంబ్.. తెలుగు వెండితెరపై ఆమెదో అరుదైన రికార్డ్!

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×