E-Paper
Advertisement

భర్త గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోయే భార్య… ఒంటరిగా చూడాల్సిన తెలుగు మూవీ

భర్త గదిలోకి వెళ్లాలంటేనే వణికిపోయే భార్య… ఒంటరిగా చూడాల్సిన తెలుగు మూవీ
Advertisement

Telugu Psychological Thriller OTT : నటుడు శ్రీ నందు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో హాట్ టాపిక్‌గా మారాడు. అతని రెండు తాజా చిత్రాలు ఒకేసారి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేయడంతో ఫ్యాన్స్ హాపీగా ఉన్నారు. ఒకే నటుడు ప్రధాన పాత్రలో ఉన్నా, రెండు సినిమాల స్ట్రీమింగ్ జర్నీ చాలా భిన్నంగా ఉంది. మరి ఆ రెండు సినిమాలు ఏంటి ? వాటి స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

మొదటి సినిమా

కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అధికారికంగా స్ట్రీమ్ అవుతోంది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన సినిమా. కథలోకి వెళ్తే… సిద్ధార్థ్ (శ్రీ నందు) అనే యువకుడే మన హీరో. అతని మనసులో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అతనికి కొన్ని విచిత్రమైన జ్ఞాపకాలు వస్తుంటాయి. ఒక రోజు అతని జీవితంలో ఒక అనుమానాస్పద సంఘటన జరుగుతుంది. అక్కడి నుంచి అతను తన గతాన్ని తవ్వి తీయాల్సి వస్తుంది. అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎవరు నిజం ? ఎవరు నటిస్తున్నారో అని అనుమానం పెరుగుతూ వస్తుంది. మనసు ఎంత బలహీనంగా ఉంటుందో, ఒక్క తప్పు ఎలా జీవితాన్ని మార్చేస్తుందో చాలా ఇంటెన్స్‌గా చూపించారు. ట్విస్టులు బాగున్నాయి.

Advertisement

Also Read : ఆటో డ్రైవర్ కు దొరికే 5 కోట్ల విలువైన పురాతన విగ్రహం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

రెండవ సినిమా

శ్రీ నందు తాజా చిత్రం ‘అగ్లీ స్టోరీ’ (Ugly Story). అవికా గోర్ సహనటిగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ థియేటర్లలో విడుదలైన 12 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌కి వచ్చేసింది. ప్రస్తుతం JioHotstarలో తెలుగు, హిందీ, తమిళం భాషలలో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే… శ్రీ నందు పాత్రలోని యువకుడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అవికా గోర్ అతని భార్య పాత్రలో ఉంటుంది. భార్యను టార్చర్ చేయడమే అతని పని. ప్రేమ పేరుతో ఆమెని బాధ పెడతాడు. ఆమెను చూస్తేనే మూడ్ వచ్చి రెచ్చిపోతాడు. సిగరెట్లతో కాల్చడం, తాగి వచ్చి గొడవ పడడం, కన్సెంట్ లేకుండా ఆమెను ముట్టుకోవడం వంటివి చేస్తాడు. అంతేకాకుండా ఆమెను ప్రేమించిన వ్యక్తి నుంచి దూరం చేసి మరీ పెళ్లి చేసుకుంటాడు. అతని చేష్టలతో హీరోయిన్ కుంగిపోతుంది. హీరోయిన్ ఇంట్లో భర్త ఉన్నా, ప్రియుడిని తలచుకుని బాధ పడుతుంది. ఒకరోజు ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏమైంది ? హీరోయిన్ ను చంపినాక ఎలా తిరిగొచ్చింది ? క్లైమాక్స్ లో వచ్చే ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిన కథ. సినిమాలో కొన్ని చిన్న పిల్లలు చూడకూడని సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడకుండా ఉంటేనే మంచిది.

Advertisement

also Read :1984లో ఎగిరి 2019లో కూలే విమానం… ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

Tags

Related News

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

పక్కింటి గోలతో కడుపుబ్బా నవ్వించే కామెడీ… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న హిందీ కామెడీ డ్రామా

రియాలిటీ షోస్ నుండి యానిమేషన్ వరకు… జియోహాట్‌స్టార్ లో ఈ వారం సిరీసుల సందడి

రాచరిక ముసుగులో రాజద్రోహం… చాట్ జీపీటీ, నానో బనాన వంటి ఏఐలతో తీసిన సిరీస్

అందమైన అమ్మాయిలతో ట్రాప్ చేయించి ఇదేం పాడు పని… అనుమానంతో అరాచకం

పెళ్లి కాకుండానే పేరెంట్స్… వియ్యంకుల మధ్య మొదలైన వింత బంధం… ఫీల్ గుడ్ కొరియన్ సిరీస్ తెలుగులో

భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్

Big Stories

Advertisement
×