E-Paper
Advertisement

MI VS RR: చివ‌రి మ్యాచ్ లోనూ ఓట‌మి..క‌నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ !

MI VS RR:  చివ‌రి మ్యాచ్ లోనూ ఓట‌మి..క‌నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ !
Advertisement

MI VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) ముంబై ఇండియన్స్ కథ ముగిసిన సంగతి తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్ లలో పదింటిలో ఓడిపోయింది ఈ ముంబై ఇండియన్స్. మరో నాలుగు మ్యాచ్ ల‌లో బతికి బయటపడింది. ఈ క్రమంలోనే తొమ్మిదవ స్థానంలో నిలిచి ఎలిమినేట్ అయింది. ఇక నిన్న లీగ్ దశలో చిట్ట చివరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ ( Mumbai Indians vs Rajasthan Royals) మ‌ధ్య‌ జరిగింది. ఇందులో కూడా కచ్చితంగా గెలుస్తారనుకున్న ముంబై ఇండియన్స్, 30 ప‌రుగుల‌ తేడాతో దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ కన్నీళ్లు (Nita Ambani Seen Crying) పెట్టుకున్నట్లు ఓ ఫోటో వైరల్ గా మారింది.

Also Read: Inzamam-ul-Haq: ఇంత అవ‌మానం జ‌రిగినా సిగ్గురాలేదా ? వెంట‌నే ఐపీఎల్ ను ఆస్ట్రేలియ‌న్స్ బ్యాన్ చేయండి !

చివ‌రి మ్యాచ్ లోనూ ఓట‌మి..క‌నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ !

Advertisement

ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తన చివరి మ్యాచ్ ఓడిపోయిన నేపథ్యంలో ఓనర్ నీతా అంబానీ (Nita Ambani) ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. డగౌట్ దగ్గర కూర్చున్న ఓనర్ నీతా అంబానీ.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు ఓ ఫోటో వైరల్ గా మారింది. గతంలో ఓ మ్యాచ్ ఓడిపోయిన సందర్భంగా కూడా ఆమె ఏడ్చారు.. ఇక చిట్ట చివరి మ్యాచ్ లోనైనా గెలుస్తామని అనుకుంటే… దారుణంగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు విఫలమయ్యారు. ఇక ఈ బాధను తట్టుకోలేక ఓనర్ నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

ముందుగా హార్దిక్ పాండ్యాను ( HardikPandya) కెప్టెన్సీ నుంచి తప్పించాలని.. మరో కొత్త ఆటగానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్ కాకుండా… ఫుల్ రోల్ అప్పగించాలని కోరుతున్నారు. రోహిత్ శర్మ సారధ్యంలోనే ముంబై ఇండియన్స్ టైటిల్స్ అందుకుందని గుర్తు చేస్తూ… వెంటనే హార్దిక్ పాండ్యా స్థానంలో అతనికి కెప్టెన్సీ అప్పగించాలని కూడా మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తేనే స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకోకుండా, సందడిగా ఉండవచ్చని సూచనలు చేస్తున్నారు.

రంగంలోకి ముఖేష్ అంబానీ

Advertisement

రాజస్థాన్ రాయ‌ల్స్ తో మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ముఖేష్ అంబానీ కూడా స్టేడియంలోకి వచ్చేసాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యాతో కాసేపు ముచ్చటించారు. హార్దిక్ పాండ్యా బుజాలపై చేతులు వేసి… పరిస్థితి ఏంటి అని తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత ముంబై ప్లేయ‌ర్ల‌తో కూడా అంబానీ మాట్లాడారు.  జాలిగానే ముఖేష్ అంబానీ ( Mukesh Ambani) కనిపించినప్పటికీ.. లోపల గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Shreyas Iyer On Ambani: అంపైర్ల‌ను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి, కానీ రాజ‌స్థాన్ ను ఓడించండి !

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×