E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : అమ్మాయిలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

OTT Movie : సీరియల్ కిల్లర్ కథలలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలను ఆడియన్స్ కూడా చిల్లింగ్ థ్రిల్ కోసమే చూస్తుంటారు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు, సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంటే, మరికొన్ని డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. సదరు ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ కూడా చేసింది. అమ్మాయిలను చంపే ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. పోస్టర్ చూస్తేనే సైలెంట్ కిల్లింగ్, ఎంత వైలెంట్ గా ఉంటుందో తెలుస్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలలోకి వెళ్తే…

ఏ ఓటీటీలోకి వస్తుందంటే

మిథున్ బాలాజి దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్టీఫెన్’. ఇందులో గోమతి శంకర్ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్ కీ రోల్స్‌లో ఉన్నారు. ఇది 2025 డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ డబ్బింగ్‌తో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్టెఫెన్ (గోమతి శంకర్) అనే ఒక మనిషి బయటికి చూడటానికి చాలా కూల్‌గా, తక్కువ మాట్లాడే టైపు. కానీ అతని మనసులో ఒక చీకటి ప్రపంచం దాగుంది. గతంలో అతనికి జరిగిన ఒక ఘోరం (చిన్నప్పుడు ఎదురైన ట్రామా) వల్ల అతను ఒక్కోసారి మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. అదీ కూడా ఎవరికీ అనుమానం రానంత ఇంటెలిజెంట్‌గా పని కానిస్తుంటాడు. ఈ హత్యలు అన్ని అమ్మాయిలతోనే మొదలు పెడతాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని చంపుతాడు. ఇప్పుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ (మైఖేల్ తంగడురై) ఒక్కొక్క మర్డర్ కేసు తీసుకుంటే… అన్నీ ఒకే ఒక మనిషి చేతివేలిముద్రలు కనిపిస్తాయి. కానీ ఆ మనిషి ఎవరో, ఎందుకు చంపుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టెఫెన్‌తో పాటు ఇంట్లో ఉండే అతని భార్య కూడా అతనిలోని ఈ చీకటి కోణాన్ని గుర్తించలేక పోతుంది.

Read Also : స్టూడెంట్‌తో ప్రొఫెసర్ పాడు పని… 6 భాషల్లో ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌

Advertisement

సినిమా మొత్తం రెండు ట్రాక్స్‌లో నడుస్తుంది. స్టెఫెన్ ఎందుకు, ఎప్పుడు చంపుతున్నాడు అనేది, పోలీసులు అతన్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు, ఎంత దగ్గరికి వచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ ట్రాక్‌లో చూపిస్తారు. అయితే ఉన్నట్టుండి కిల్లర్ పోలీసులకు లొంగిపోతాడు. దీంతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. చివరి 30 నిమిషాల్లో ఒక్కసారిగా అతని గతంలో ఏం జరిగింది, ఎందుకు ఇలా అయ్యాడు అనేది ఓ భయంకరమైన ట్విస్ట్‌తో ఓపెన్ అవుతుంది. ఆ ట్విస్ట్ ని చూస్తే ‘అయ్యబాబోయ్ ఇదా అసలు కారణం’ అనిపించే లెవెల్ లో షాక్ ఉంటుంది. చివరికి పోలీసులకు కిల్లర్ ఎందుకు లొంగిపోయాడు ? కిల్లర్ ఎందుకు అమ్మాయిలనే చంపుతున్నాడు ? దీని వెనుక కారణం ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.

 

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×