E-Paper
Advertisement

OTT Movie : కోరికలతో అల్లాడిపోయే దెయ్యం… డేటింగ్ యాప్ తో ఎంట్రీ … చలి కాలంలో చెమటలు పట్టించే స్టోరీ

OTT Movie : కోరికలతో అల్లాడిపోయే దెయ్యం… డేటింగ్ యాప్ తో ఎంట్రీ … చలి కాలంలో చెమటలు పట్టించే స్టోరీ
Advertisement

OTT Movie : హారర్ ఫ్యాన్స్‌కి మోడరేట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది ‘సక్యుబస్’ మూవీ. రీసెంట్ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రస్తుతం రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది. ఇది ఒక సూపర్‌ న్యాచురల్ హారర్‌గా తెరకెక్కింది. ఒక తండ్రి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ మధ్య డేటింగ్ యాప్‌లో అమ్మాయి కోసం ఆరాటపడతాడు. అయితే మగవాళ్లను సెడ్యూస్ చేసి, ఎనర్జీ తీసుకునే ఒక డెమన్ అతని లైఫ్ లోకి వస్తుంది. ఆ తరువాత ఏమందనేదే ఈ కథ. రొమాంటిక్ కంటెంట్ ఇందులో మోతాదుకు మించి ఉంటుంది. ఒంటరిగానే ఈ సినిమాని చూడటం మంచిది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘సక్యుబస్’ (Succubus) 2024లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. R.J. డానియల్ హాన్నా డైరెక్షన్ లో బ్రెండన్ బ్రాడ్లీ, రాచెల్ కుక్, ఒలివియా గ్రేస్ ఆపిల్‌గేట్, రోసాన్నా ఆర్క్వెట్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. 2024 సెప్టెంబర్ 24 న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video, Apple TV, Google Play రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్రిస్ అనే వ్యక్తి భార్యతో గొడవలు, బేబీతో నిద్ర లేకపోవడం వంటి వాటితో జీవితం ఒక నరకంలా ఫీల్ అవుతుంటాడు. దీని నుంచి బయటపడటానికి ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసిన డేటింగ్ యాప్‌లో స్వైప్ చేస్తూ లిసా అనే అదిరిపోయే అందగత్తెతో మ్యాచ్ అవుతాడు. మొదట చాట్, తర్వాత మీటింగ్ తో క్రిస్ లో కొత్త హుషారు వస్తుంది. లిసా టచ్‌తో క్రిస్ శరీరంలో ఏదో ఎనర్జీ పీకేసినట్టు ఫీల్ అవుతాడు. రాత్రి పడుకుంటే లిసా ఒంటి మీద నూలు పోగు లేకుండా డ్రీమ్స్‌లో వచ్చి రొమాన్స్ చేస్తుంది. ప్రతిసారి క్రిస్ బక్క చిక్కిపోతాడు. రోజులు గడిచేకొద్దీ కళ్లు ఎర్రబడతాయి, శరీరం బూడిద రంగులోకి మారుతుంది. చివరికి లిసా అసలు మనిషి కాదు, ‘సక్యుబస్’ అనే శృంగార దెయ్యం అని క్రిస్ తెలుసుకుంటాడు. అది మగవాళ్లని సెడ్యూస్ చేసి ప్రాణశక్తిని పీకేస్తుంది.

Read Also : మగాళ్లను ముక్కలుగా కోసే కత్తిలాంటి అమ్మాయి… ఈ హిట్టు మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ పేరెత్తితే ఒట్టు

 ఇంతలో అతని ఫ్రెండ్ ఎడ్డీ కూడా లిసాతో మీట్ అయ్యి, ఆస్పత్రిలో నోటి నుంచి నల్లటి ద్రవం కారుతూ భయంకరంగా చనిపోతాడు. ఇక క్రిస్ ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. చివరగా డెమన్ పూర్తి రూపంలో వచ్చి, నీ ఫ్యామిలీ వదిలేసి నాతో రా అని ఆర్డర్ ఇస్తుంది. క్రిస్ భయంతో వణుకుతూ, భార్య బేబీని గుర్తు చేసుకుని ఒక్కసారిగా నో అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో ఇల్లు వణుకుతుంది. ఇప్పడు డెమన్ వెనక్కి వెళ్లిపోతుందా ? దాని చేతిలో క్రిస్ కూడా బలవుతాడా అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.
Advertisement

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×