E-Paper
Advertisement

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్
Advertisement

SIR Voter Deletion: ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు హక్కు, ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, కేంద్ర విధానాలపై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ – ఓట్ల కోత కుట్ర

Advertisement

1950 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టే ఎస్‌ఐఆర్ ప్రక్రియను గతంలో ఓటు హక్కు లేని వారిని చేర్పించడానికి ఉపయోగించేవారని సీఎం గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు బీజేపీ ఓటర్ల సంఖ్యను తగ్గించేందుకు దీనిని వాడుతోందని ఆరోపించారు. 2024లో 97 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, 2029 నాటికి 84 కోట్లకు పడిపోయిందని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారని మండిపడ్డారు. దేశ జనాభా 140 కోట్లకు పెరిగినప్పుడు ఓట్ల సంఖ్య కూడా పెరగాలి కదా అని ప్రశ్నించారు. నాలుగోసారి అధికారంలోకి రావడానికి ఏకంగా 20 కోట్ల ఓట్లను తగ్గించాలని మోదీ చూస్తున్నారని ధ్వజమెత్తారు.

రెండు రకాల పౌరులు .. జెన్ జీ ఉద్యమం

Advertisement

దేశంలో ఓటు హక్కు ఉన్న శ్రీమంతులు, ఓటు లేని నిరుపేదలు అని రెండు రకాల పౌరులను తయారుచేస్తూ మోదీ దేశాన్ని రాజరికం వైపు తీసుకెళ్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోందని, వాట్సాప్ యూనివర్సిటీ తప్పుడు ప్రచారాల వల్ల జెన్ జీ వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తోందని అన్నారు. కేంద్రం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రస్తుతం మోదీపై తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు.

జ్ఞానేశ్ గో బ్యాక్ .. రాంలీలా మైదాన గర్జన

1927లో బ్రిటిష్ వారు సైమన్ కమిషన్‌ తెచ్చినప్పుడు లాలా లజపతిరాయ్ నేతృత్వంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమం వచ్చి స్వాతంత్ర్యానికి దారితీసిందని గుర్తుచేశారు. ఇప్పుడు వందేళ్ల తర్వాత జ్ఞానేశ్ కమిషన్ ద్వారా దేశాన్ని ఏలాలని చూస్తున్న మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ జ్ఞానేశ్ గో బ్యాక్ నినాదంతో ముందుకెళ్తున్నారన్నారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే నిరసనకు తెలంగాణ నుంచి 10 నుంచి 15 వేల మంది తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. 2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసే వరకు ఈ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

Also Read: స్థానిక సమరంలో హింసకు తావులేదు: ఏపీ డీజీపీ కీలక హెచ్చరిక

Tags

Related News

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

హరీష్‌ రావును నమ్మితే మన్నుతో అంబలి తాగినట్టే!- సీఎం రేవంత్

కుళ్లిన అల్లం, ఫంగస్‌ వెల్లుల్లితో ఏ1 పేస్ట్.. మేడ్చల్‌లో అధికారుల గుట్టు రట్టు!

తెలంగాణ బార్ కౌన్సిల్‌కు బిగ్ షాక్.. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలపై BCI స్టే!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుపై ఈటల రాజేందర్‌ సంచలన నిర్ణయం.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర!

Big Stories

Advertisement
×