E-Paper
Advertisement

1999 నాటి Y2K కాన్సెప్ట్ తో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సిరీస్… ఇరగేస్తున్న సూపర్ హీరోల యాక్షన్

1999 నాటి Y2K కాన్సెప్ట్ తో ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సిరీస్… ఇరగేస్తున్న సూపర్ హీరోల యాక్షన్
Advertisement

Superhero Korean comedy action series : హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో హీరోలు తమ శక్తులతో ప్రపంచాన్ని స్టైలిష్‌గా కాపాడుతుంటారు. అయితే రీసెంట్ గా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కొరియన్ సిరీస్ లో హీరోలకు పవర్స్ ఉన్నా, అవి పర్ఫెక్ట్‌గా పనిచేయవు. భయపడినప్పుడు కంట్రోల్ తప్పే ఈ శక్తుల వల్ల వచ్చే సీన్లు మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి కూడా. ఈ కథ మొత్తం 1999వ సంవత్సరం బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. 2000 సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ప్రపంచం అంతమైపోతుందనే వై2కే (Y2K) భయాలు, అప్పటి మనుషుల లైఫ్ స్టైల్ ఈ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన ఫీల్‌ను ఇస్తాయి. ఇది ఏ వయసు వారైనా ఎలాంటి బోరింగ్ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సిరీస్.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ సూపర్ హీరో యాక్షన్ కామెడీ కొరియన్ డ్రామా పేరు ‘ది వండర్‌ఫూల్స్’ (The Wonderfools). ఇది 2026 మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ట్రెండింగ్ లో ఉంది. 8 ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్‌ను సూపర్ హిట్ డ్రామా ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ ఫేమ్ దర్శకుడు యూ ఇన్-షిక్ తెరకెక్కించగా, ప్రముఖ రచయిత కాంగ్ ఉన్-క్యుంగ్ క్రియేటర్‌గా వ్యవహరించారు. ఒక విశేషం ఏంటంటే, ఈ సిరీస్ ఐడియా మార్వెల్ కామిక్స్ సృష్టికర్త స్టాన్ లీ రాసుకున్న “ది బి టీమ్” అనే కాన్సెప్ట్ ఆధారంగా పుట్టింది. హై-క్వాలిటీ గ్రాఫిక్స్ (VFX), 1999 నాటి Y2K రెట్రో వాతావరణాన్ని స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా చూపించడం కోసం 2024 అక్టోబర్ నుండి 2025 మే వరకు దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ డ్రామా షూటింగ్ జరిపారు. ఈ సిరీస్ 2026 మే 15న ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అన్ని ఎపిసోడ్‌లతో ఒకేసారి విడుదలైంది. ప్రతి ఎపిసోడ్ సుమారు ఒక గంట నిడివితో ఉండి, ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ టెన్ లిస్ట్‌లో చేరి ఈ డ్రామా సంచలనం సృష్టించింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1999 చివర్లో వై2కే (Y2K) వల్ల ప్రపంచం అంతమైపోతుందనే పిచ్చి భయాలు నడుస్తున్న రోజుల్లో హేసోంగ్ అనే ఊరిలో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ ఊరిలో ఉండే ఉన్ చే-ని (పార్క్ ఉన్-బిన్) అనే ఒక అల్లరి పిల్లకు, అలాగే అక్కడ సిటీ హాల్‌లో పనిచేసే ఉద్యోగి లీ ఉన్-జియాంగ్ (చా ఉన్-వూ)కు ఒక కెమికల్ యాక్సిడెంట్ వల్ల వింతైన సూపర్ పవర్స్ వస్తాయి. చే-నికి ఒక చోటు నుండి ఇంకో చోటుకి క్షణాల్లో వెళ్లే పవర్, ఉన్-జియాంగ్‌కు వస్తువులను తాకకుండా కదిలించే పవర్స్ దక్కుతాయి. అయితే కామెడీ ఏంటంటే, వీళ్లకు ఆ శక్తులను ఎలా కంట్రోల్ చేయాలో అస్సలు తెలియదు. కంగారు పడినా, భయపడినా ఆ పవర్స్ పిచ్చిపిచ్చిగా పనిచేస్తూ వీళ్లను నవ్వులపాలు చేస్తుంటాయి.

ఇలాంటి టైమ్‌లో, డాక్టర్ హా అనే ఒక సైకో సైంటిస్ట్ మనుషులపై వింత ప్రయోగాలు చేస్తూ ఆ ఊరిని, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. అసలే పవర్స్ సరిగ్గా వాడటం రాని ఈ అమాయకపు సూపర్ హీరోల గ్యాంగ్ అంతా కలిసి, ఆ విలన్ ప్లాన్స్‌ను ఎలా చెడగొట్టారు ? తమ ఊరిని ఎలా కాపాడుకున్నారు ? అనేదే ఈ సిరీస్ కథ. 90ల నాటి రోజులను గుర్తుచేసే సీన్లు, అదిరిపోయే గ్రాఫిక్స్, ఇంకా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కామెడీ సీన్లతో ఈ 8 ఎపిసోడ్‌ల సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో భలే ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

Advertisement

Read Also : జైలు నుంచే క్రైమ్స్ సాల్వ్ చేసే ఖైదీ… నాలుగు ఎపిసోడ్లతో బుర్ర హీటెక్కిస్తున్న కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×