E-Paper
Advertisement

మంచు కొండల్లో చిక్కుకున్న ప్రాణం… ఒళ్ళు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్

మంచు కొండల్లో చిక్కుకున్న ప్రాణం… ఒళ్ళు గగుర్పొడిచే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller OTT : తక్కువ బడ్జెట్, తక్కువ మంది నటీనటులతో తీసినప్పటికీ కొన్ని సినిమాలు విజయాలను అందుకుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా అలాంటిదే. కేవలం 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఒకే కారులో జరిగే ఉత్కంఠభరితమైన సర్వైవల్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల పరంగా కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోగా నటించిన అలెన్ లీచ్ తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఇందుకోసం ఆయనకు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా నామినేషన్లు కూడా దక్కాయి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2023లో వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘కోల్డ్ మీట్’ (Cold Meat). దర్శకుడు సెబాస్టియన్ డ్రూయిన్ తన విజువల్ ఎఫెక్ట్స్ అనుభవంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఇందులో అలెన్ లీచ్, నినా బెర్గ్‌మాన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాను కేవలం 13 రోజుల్లోనే కెనడాలోని ప్రిన్స్ జార్జ్ అనే మంచు ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రస్తుతం Prime Video, Apple TV ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కొలరాడోలోని మంచు పర్వతాల మధ్య ఈ కథ మొదలవుతుంది. హీరో డేవిడ్ ఒక హోటల్‌లో ఆగినప్పుడు, అక్కడ వెయిట్రెస్‌గా పనిచేసే అనాను ఆమె మాజీ భర్త విన్సెంట్ వేధిస్తుంటాడు. డేవిడ్ జోక్యం చేసుకుని ఆమెను కాపాడుతాడు. ఆ తర్వాత డేవిడ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా, విన్సెంట్ తన ట్రక్కుతో అతన్ని వెంబడిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఛేజింగ్‌లో, డేవిడ్ కారు అదుపు తప్పి ఒక లోయలో పడిపోతుంది. దీంతో డేవిడ్ కాలుకి దెబ్బ తగులుతుంది. మంచు విపరీతంగా కురుస్తుండటంతో కారు పూర్తిగా కూరుకుపోతుంది. అయితే ఇక్కడే సినిమా పెద్ద మలుపు తిరుగుతుంది. మనం చూస్తున్న హీరో డేవిడ్ హీరో కాదు, ఒక సీరియల్ కిల్లర్. అతను హోటల్ దగ్గర అనాను కాపాడింది ఆమెపై జాలితో కాదు, ఆమెను కిడ్నాప్ చేయడానికే. కారు డిక్కీలో అనాను బంధించి తీసుకెళ్తుండగానే ఈ ప్రమాదం జరుగుతుంది.

ఈ సమయంలో బయట విపరీతమైన చలి ఒక సమస్య అయితే, ఆ ప్రాంతంలో ఒక పెద్ద ప్రమాదకరమైన వింత జంతువు తిరుగుతుంటుంది. ఆ జంతువు కారుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. డేవిడ్ తన గాయంతో పోరాడుతూనే అనాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తాడు. చివరకు ఈ క్లైమాక్స్ భయంకరంగా ముగుస్తుంది. ఆ మృగం నుంచి వీళ్ళు ప్రాణాలతో బయట పడ్డారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఇదెక్కడి సినిమా బాబోయ్… ఊరు ఊరంతా జాంబిలు… ఇక్కడ బతకడం చావు కన్నా దారుణం

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×