E-Paper
Advertisement

Michael Clarke divorce: ప‌నిమ‌నిషితో అక్ర‌మ సంబంధం..భార్య‌ను వ‌దిలించుకునేందుకు రూ.300 కోట్లు భ‌ర‌ణం ఇచ్చిన‌ మైఖేల్ క్లార్క్‌

Michael Clarke divorce: ప‌నిమ‌నిషితో అక్ర‌మ సంబంధం..భార్య‌ను వ‌దిలించుకునేందుకు రూ.300 కోట్లు భ‌ర‌ణం ఇచ్చిన‌ మైఖేల్ క్లార్క్‌
Advertisement

Michael Clarke divorce: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న కారణాలవల్ల విడిపోవడం జరుగుతోంది. అదే సమయంలో భార్యకు కోట్లల్లో భరణాలు కూడా ఇస్తున్నారు. సమంత నుంచి మొదలుకొని ధనశ్రీ వర్మ వరకు చాలా మంది సెలబ్రిటీలు భరణం అందుకున్నారు. ఈ సెలబ్రిటీలు అందరూ మహా అంటే రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ఆ లోపే భరణం అందుకున్నారట. కానీ తన భార్యను వదిలించుకోవడానికి ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ( Michael Clarke ). 2020లో తన భార్యకు విడాకులు ఇచ్చిన మైఖేల్ క్లార్క్ ఏకంగా రూ.300 కోట్లు తన భార్యకు భరణంగా ఇచ్చాడట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

భార్యకు రూ.300 కోట్ల భరణం ఇచ్చిన మైఖేల్ క్లార్క్

Advertisement

2004 నుంచి దాదాపు 2015 వరకు ఆస్ట్రేలియా క్రికెట్ ను ఏలిన మైఖేల్ క్లార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి మైఖేల్ క్లార్క్ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2012 సంవత్సరంలో కైలీ క్లార్క్ ( Kyly Clarke) అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు మైఖేల్ క్లార్క్. ఈ జంటకు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే పెళ్లి అయిన తర్వాత దాదాపు 8 సంవత్సరాలకు అంటే 2020లో మైఖేల్ క్లార్క్ జంట విడాకులు తీసుకుంది.

మైఖేల్ క్లార్క్ తన పర్సనల్ అసిస్టెంట్ తో రిలేషన్ పెట్టుకున్నాడట. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా ఆయన భార్య కైలీ పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మైఖేల్ క్లార్క్ కు విడాకులు ఇచ్చిందట కైలీ క్లార్క్‌. అయితే విడాకులు ఇచ్చిన నేపథ్యంలో తన ఆస్తి దాదాపు మొత్తం భరణంగా ఆయన భార్యకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కైలీ క్లార్క్ కు మొత్తం రూ.300 కోట్లు భరణంగా ( Michael Clarke 300 CR alimony ) చెల్లించి హాట్ టాపిక్ అయ్యారట మైఖేల్ క్లార్క్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైవ‌ర్స్ ల‌లో మైఖేల్ క్లార్క్ విడాకులు నిలిచిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా తమ కూతురిని ఇద్దరూ ఆనందంగానే చూసుకుంటారట. ఇద్దరు కలిసి ఆమెతో గడుపుతారని సమాచారం.

మైఖేల్ క్లార్క్ ఆస్తులు ఎన్ని ?

Advertisement

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రస్తుత ఆస్తులు అధికారికంగా మాత్రం రూ.185 కోట్లు అని తెలుస్తోంది. అయితే 2020లో రూ.300 కోట్ల వరకు భరణంగా భార్యకు ఇవ్వడంతో మైఖేల్ క్లార్క్ ఆస్తులు మొత్తం తరిగిపోయినట్టు తెలుస్తోంది. అంతకుముందు మైఖేల్ క్లార్క్ ఆస్తులు దాదాపు రూ.600 కోట్లకు పైగా ఉండేవట. కాగా 2004 నుంచి ఆస్ట్రేలియా జట్టులో ఆడుతున్న మైఖేల్ క్లార్క్ 2011 నుంచి 2015 వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ గా వ్యవహరించాడు. 2015 ప్రపంచ కప్ ఆడిన ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు.

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

 

 

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×