Shoaib Akhtar On Pakistan Team : శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ ప్రారంభమైన నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెటర్లపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, షాబాద్ ఖాన్ పాకిస్తాన్ కోసం కాకుండా పర్సనల్ రికార్డుల కోసమే ఆడుతున్నట్టు పీసీబీ భావిస్తోందని షోయబ్ అక్తర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాళ్లను దేశ ద్రోహులు భావించి, పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి తొలగించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఓడిపోయినందుకు బాబర్ ఆజంను వన్డే క్రికెట్ నుంచి పర్మినెంట్ గా పంపించే ప్రక్రియ షురూ అయిందని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
బాబర్ ఆజంను బయటకు పంపించిన తర్వాత పర్సనల్ రికార్డులు, లీగ్ క్రికెట్పైన దృష్టి పెట్టిన వాళ్ల భరతం పట్టేందుకు బోర్డు పెద్దలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ తరుణంలోనే తాను చెప్పిన సీనియర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. పాకిస్తాన్ గడ్డపై జరుగుతోన్న వన్డే ట్రై సిరీస్లో షాహీన్ అఫ్రిది సేనకు కచ్చితంగా హోం అడ్వాంటేజ్ ఉంటుందన్నారు. హోం అడ్వాంటేజ్ తీసుకోకపోతే సిరీస్ ఇంగ్లాండ్ వశం అవుతుందని అంచనా వేశారు.
శ్రీలంక, ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య ఆదివారం నుంచే వన్డే సిరీస్ ట్రై షురూ అయింది. ఈ ట్రై సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సిరీస్ ను ఏ ఒక్క సీనియర్ ప్లేయర్ లైట్ తీసుకున్నా, కష్టమేనని హెచ్చరించారు. ఈ సిరీస్ లో బాగా ఆడిన సీనియర్లను 2027 వన్డే వరల్డ్ కప్ లోకి తీసుకుంటారని, లేకపోతే మెడలు పట్టి గెంటేయడం గ్యారెంటీ అన్నారు. ఈ పనిపైనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫోకస్ చేసిందని వివరించారు. ఈ తరుణంలోనే ఓ ఒక్క ప్లేయర్ అజాగ్రత్తగా ఆడకూడదని సూచనలు చేశారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, షాబాద్ ఖాన్, బాబర్ ఆజంలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాస్త లైట్ తీసుకున్నా, పాకిస్తాన్ జట్టు నుంచి బయట పడేస్తారంటూ హెచ్చరించారు.
2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియాను ఓడించే దిశగా పాకిస్తాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని షోయబ్ అక్తర్ సూచనలు చేశారు. వచ్చే వరల్డ్ కప్ లో పాకిస్తాన్, టీమిండియా రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ తరుణంలోనే దాయాదుల మధ్య కనీసం మూడు మ్యాచ్ లు జరిగే ఛాన్సులు ఉన్నాయని తెలిపారు. ఈ తరుణంలోనే టీమిండియాను ఓడించాలని, ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. దీని కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.