E-Paper
Advertisement

Crime News: తీవ్ర విషాదం.. పెద్దపల్లి జిల్లాలో బర్త్‌డే రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలుడు

Crime News: తీవ్ర విషాదం.. పెద్దపల్లి జిల్లాలో  బర్త్‌డే రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలుడు
Advertisement

Crime News: ఆ బాలుడికి బర్త్‌డే రోజే డెత్‌డే అయ్యింది. పుట్టినరోజు జరుపుకోవాలని పేరెంట్స్ రెడీ అవుతున్న టైంలో కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. మొగిలి మోక్షిత్ అనే బాలుడు వేడి సాంబారు పాత్రలో పడి చనిపోయిన ఘటన పెద్దపెల్లి జిల్లాలోని మల్లాపూర్‌ బాలికల గురుకులంలో చోటుచేసుకుంది.

పుట్టిన రోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన బాలుడు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మొగిలి మధుకర్ గత ఏడాదిన్నర కాలం నుంచి మల్లాపూర్ బాలికల గురుకులంలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. మధుకర్ భార్య శారద, కూతురు శ్రీమహి, కుమారుడు మోక్షిత్‌తో కలిసి గురుకులంలోని క్వార్టర్‌లో ఉంటూ అక్కడ వంట మనిషిగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం వంట గదిలో మధుకర్ వంట చేస్తున్నాడు. దీంట్లో భాగంగానే వంట పాత్రలో సాంబారు వండి దానిని పక్కన పెట్టాడు.

Advertisement

ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సాంబార్ గిన్నెలో పడిపోయిన కొడుకు
ఇదే టైంలో అతని కొడుకు మోక్షిత్ ఆడుకుంటూ వెళ్లి వంట గదిలోకి వచ్చి అకస్మాత్తుగా వేడి సాంబారు వంట పాత్రలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన తండ్రి మధుకర్ తన కొడుకును చికిత్స కోసం మొదట కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి మోక్షిత్‌ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.

Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి..

Advertisement

కొడుకు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
హాస్పిటల్‌కి చేరుకున్న కొద్దిసేపటికి మోక్షిత్ చనిపోయాడు. మరికొద్ది సేపట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే సమయంలో కన్న కొడుకు చనిపోవడంతో బాలుడి కుటుంబంలో విషాదాన్ని నిండిపోయింది. మోక్షిత్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×