E-Paper
Advertisement

Suspens thriller : రాత్రి పూట వీడియోలతో పాపులర్… డబ్బు కోసం మృగంలా… చూస్తే బుర్ర పాడు

Suspens thriller : రాత్రి పూట వీడియోలతో పాపులర్… డబ్బు కోసం మృగంలా… చూస్తే బుర్ర పాడు
Advertisement

Suspens thriller : సినిమాలు రకరకాల కంటెంట్ లతో వస్తుంటాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ని ఎక్కుగా చూస్తున్నారు. భాషను కూడా పట్టించుకోవట్లేదు. ఇక ఓ క్రైమ్ థ్రిల్లర్ గిరించి మనం చెప్పుకోవాల్సిందే. టివి ఛానల్స్ రేటింగ్స్ కోసం ఎలాంటి పద్దతులు ఫాలో అవుతాయనేది ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగం లేని యువకుడు డబ్బు కోసం, టీవీ న్యూస్ ఛానెళ్లకు భయంకరమైన వీడియోలను ఎలా క్రియేట్ చేసేవాడో ఈ సినిమా థ్రిల్లింగ్ గా చూపిస్తుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ అమెరికన్  క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నైట్‌క్రాలర్’ (Nightcrawler). 2014లో వచ్చిన ఈ సినిమాకు డాన్ గిల్‌రాయ్ దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో జేక్ గిలెన్‌హాల్ మెయిన్ రోల్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా లభించాయి. చాలా మంది దీన్ని అతని బెస్ట్ రోల్స్‌లో ఒకటిగా చెబుతారు. ఈ సినిమా లాస్ ఏంజిల్స్ నగరంలోని ఒక చీకటి క్రైమ్ జర్నలిజం ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ చిత్రం 87వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేట్ అయింది. ప్రస్తుతం Apple TVలో రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

లూ బ్లూమ్ (జేక్ గిల్లెన్‌హాల్) లాస్ ఏంజిల్స్‌లో ఒక నిరుద్యోగిగా ఉంటాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ తింగరి పనులు చేస్తూ, ఇనుప కంచెలు, ఇతర సామాన్లు దొంగిలించి అమ్ముకుంటూ బతుకుతుంటాడు. ఒక రాత్రి రోడ్డుపై వెళ్తుండగా ఒక కారు ప్రమాదాన్ని చూస్తాడు. అక్కడ కొందరు ఫ్రీలాన్స్ కెమెరామెన్లు, ఆ ప్రమాదాన్ని వీడియో తీయడం గమనిస్తాడు. ఆ వీడియోలను టీవీ ఛానెళ్లకు అమ్మి భారీగా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకున్న లూ, తాను కూడా అదే రంగంలోకి దిగాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఒక సైకిల్‌ను దొంగిలించి, దాన్ని అమ్మి ఒక మామూలు కెమెరా కొంటాడు. రాత్రిపూట పోలీసులు వెళ్లే చోటల్లా తిరుగుతూ ప్రమాదాలను వీడియో తీయడం మొదలుపెడతాడు.

ఒక లోకల్ టీవీ ఛానెల్ న్యూస్ డైరెక్టర్ కు అతని వీడియోలు నచ్చుతాయి. రేటింగ్స్ కోసం ఆమెకు భయంకరమైన ఫుటేజ్ కావాలి. లూ కూడా ఆమె అవసరాలకు తగ్గట్టుగా ఎంతటి ఘోరమైన వీడియోనైనా తీసివ్వడానికి సిద్ధపడతాడు. సహాయం కోసం ఒక పేద యువకుడిని తక్కువ జీతానికి అసిస్టెంట్‌గా కూడా పెట్టుకుంటాడు. డబ్బు కోసం లూ క్రమంగా క్రూరంగా మారుతాడు. ఎంతలా అంటే తన అసిస్టెంట్ హంతకుల చేతిలో చనిపోతుంటే, అతన్ని కాపాడటానికి బదులు అతని చావును కూడా వీడియో తీస్తాడు. ఆ వీడియోను భారీ ధరకు అమ్మి, పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకుంటాడు. చివరికి అతని ప్రయాణం ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది ? అనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : లెక్కల మాస్టారుకి ఫ్యామిలీ డెడ్లైన్… లెక్క తప్పే కొత్తకారు మోజు… మిడిల్ క్లాస్ మెమొరీస్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×