E-Paper
Advertisement

130km Electric Bike: డెకథ్లాన్ కొత్త ఎలెక్ట్రిక్ సైకిల్.. Bosch మోటార్‌తో 130కిమీ రేంజ్.. ధర ఎంతంటే?

130km Electric Bike: డెకథ్లాన్ కొత్త ఎలెక్ట్రిక్ సైకిల్.. Bosch మోటార్‌తో 130కిమీ రేంజ్.. ధర ఎంతంటే?
Advertisement

Decathlon 130km Electric Bike| ప్రముఖ స్పోర్టస్ గూడ్స్ తయారీ కంపెనీ డెకాథ్లాన్ తాజాగా యూరప్‌లో ఒక కొత్త ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్‌ లాంచ్ చేసింది. దీని పేరు స్టైలస్ E టూరింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బైక్‌. ముందుగా ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో విడుదల చేసింది. రోజువారీ రవాణా, తేలికపాటి ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ఈ బైక్ బాగుంటుంది. పాత మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త వెర్షన్‌లో సౌలభ్యం, పర్‌ఫామెన్స్ మెరుగుపడ్డాయి. చాలా కాంపోనెంట్లు అప్‌గ్రేడ్ చేశారు.

పవర్‌ఫుల్ మోటార్, ఎక్కువ రేంజ్

బైక్‌లో బోష్ పెర్ఫార్మెన్స్ లైన్ CX మిడ్-డ్రైవ్ మోటార్ ఉంది. ఇది 85Nm టార్క్ ఇస్తుంది. బలమైన యాక్సిలరేషన్, స్మూత్ రైడింగ్ సపోర్ట్ లభిస్తాయి. బోష్ పవర్‌ట్యూబ్ 750Wh బ్యాటరీ ఉంది. ఒక్క ఛార్జ్‌తో 130 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. రైడింగ్ కండిషన్స్ ఆధారంగా రేంజ్ మారవచ్చు. సిటీ రోడ్లు, ట్రైల్స్‌లో బలమైన సపోర్ట్ ఇస్తుంది.

ధర వివరాలు

Advertisement

ఫ్రాన్స్, స్పెయిన్‌లో బైక్ ధర 3,299.99 యూరోస్ (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.53 లక్షలు). నెదర్లాండ్స్‌లో 3,349.99 యూరోస్. ఇతర మార్కెట్లలో ఇంకా లభ్యత గురించి ప్రకటించలేదు. తర్వాత ఇతర దేశాలకు విస్తరించవచ్చు.

ఫ్రేమ్, డిజైన్

ఈ బైక్‌లో 6061 అల్యూమినియం ఫ్రేమ్ ఉపయోగించారు. బలం, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉంటాయి. స్మాల్, మీడియం, లార్జ్ సైజుల్లో లభిస్తుంది. మీడియం సైజు బరువు సుమారు 26 కిలోలు. లో స్టెప్-త్రూ ఫ్రేమ్ డిజైన్ ఉంది. బైక్ ఎక్కడం, దిగడం సులభం. సిటీ రైడర్లకు చాలా సౌలభ్యం ఉంటుంది.

రైడింగ్ మోడ్స్, సస్పెన్షన్

Advertisement

ఐదు అసిస్టెన్స్ మోడ్స్ ఉన్నాయి. ఈకో మోడ్ నుంచి టర్బో మోడ్ వరకు ఉంటాయి. రోడ్, టెరైన్ ఆధారంగా సపోర్ట్ సర్దుబాటు చేయవచ్చు. సస్పెన్షన్‌గా సన్‌టూర్ XCM32 ATB ఫోర్క్ ఉంది. 100mm ట్రావెల్ ఇస్తుంది. అసమాన రోడ్లపై కంఫర్ట్‌గా రైడ్ చేయవచ్చు.

టైర్లు, డ్రైవ్‌ట్రెయిన్, బ్రేక్స్

29 ఇంచ్ స్చ్వాల్బే జానీ వాట్స్ టైర్లు ఉన్నాయి. మంచి గ్రిప్, స్టెబిలిటీ ఇస్తాయి. సిటీ స్ట్రీట్స్, గ్రావెల్ పాత్‌లలో బాగా పని చేస్తాయి. షిమానో CUES 11-స్పీడ్ డ్రైవ్‌ట్రెయిన్ ఉంది. స్మూత్ గేర్ షిఫ్టింగ్ లభిస్తుంది. షిమానో MT200 హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. రిలయబుల్ స్టాపింగ్ పవర్ ఇస్తాయి.

Also Read: ఆపిల్ కొత్త ఫోన్‌లో పెద్ద సమస్య.. తలబాదుకుంటున్న యూజర్లు

స్మార్ట్ డిస్‌ప్లే, సెక్యూరిటీ

బోస్చ్ Kiox డిస్‌ప్లే యూనిట్ ఉంది. అడ్వాన్స్‌డ్ నావిగేషన్ ఫీచర్లు ఇస్తుంది. రైడ్ డేటా క్లియర్‌గా చూపిస్తుంది. eBike లాక్ ఫంక్షన్ ఉంది. థెఫ్ట్ నుంచి రక్షణ ఇస్తుంది. పార్కింగ్ సమయంలో ఆందోళన అవసరం లేదు.

స్టైలస్ E టూరింగ్ పవర్, కంఫర్ట్ రెండూ కలిపింది. బలమైన టార్క్, ఎక్కువ రేంజ్ ఇస్తుంది. అప్‌గ్రేడెడ్ కాంపోనెంట్లతో మొత్తం పర్‌ఫామెన్స్ మెరుగైంది. కమ్యూటింగ్, అడ్వెంచర్ రైడింగ్ రెండింటికీ సరిపోతుంది. వెర్సటిలిటీ, రిలయబిలిటీ కోరుకునే రైడర్లకు ఇది గొప్ప ఆప్షన్.

Related News

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×