BigTV English
Advertisement

OTT Movie : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్

OTT Movie : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్

OTT Movie : ‘మంజుమ్మెల్ బాయ్స్’ రిలీజ్ అయ్యాక సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా సరే వదలకుండా చూస్తున్నారు. ఓటీటీ మూవీ లవర్స్. అయితే కేవలం సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఇంట్రస్టింగ్ గానే ఉన్నప్పటికీ, దానికి జాంబీ వంటి మరో ఇంట్రెస్టింగ్ టచ్ ఇస్తే అదిరిపోతుంది కదా. అందులోనూ తెగేదాకా తెచ్చుకున్న ఓ జంట బంధం ఈ క్రైసిస్ కారణంగా మారితే… అలాంటి ఒక అద్భుతమైన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. పైగా ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ 

జూ (Zoo) 2018లో విడుదలైన స్వీడిష్ డార్క్ కామెడీ-హారర్ సినిమా, డారిన్ ఎల్ఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హోకాన్ పాల్మ్ (కార్ల్), హెలెనా ఆఫ్ గ్లోమ్స్టాడ్ (వానిల్లా), రోబిన్ నాస్‌లుంద్ (జాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2018 అక్టోబర్ 12న స్వీడన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రన్‌టైమ్ 1 గంట 36 నిమిషాలు. IMDbలో రేటింగ్ 5.5 ఉన్న ఈ సినిమా జాంబీ అపోకలిప్స్, మ్యారేజ్ క్రైసిస్, డార్క్ హ్యూమర్, సర్వైవల్, రెలేషన్‌షిప్ డ్రామా థీమ్స్ తో తెరకెక్కింది. సినిమా డార్క్ కామెడీ – హారర్ మిక్స్‌తో, జాంబీ అపోకలిప్స్‌లో చిక్కుకున్న కపుల్ కథ. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే… 

సినిమా కార్ల్ (హోకాన్ పాల్మ్), వానిల్లా (హెలెనా ఆఫ్ గ్లోమ్స్టాడ్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. అప్పటికే పెళ్లి చేసుకున్న వీరిద్దరూ గొడవల కారణంగా విడిపోయే స్థితిలో ఉంటారు. కార్ల్ ఒక ఫెయిల్డ్ ఆర్టిస్ట్. వానిల్లా ఒక ఫ్రస్ట్రేటెడ్ వుమన్. తమ రిలేషన్‌షిప్‌ను సేవ్ చేయడానికి కౌన్సెలింగ్ సెషన్‌కు వెళ్తారు. కానీ వాళ్ళు కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకున్నప్పుడు, సెంటర్ జాంబీ అపోకలిప్స్‌లో చిక్కుకుటుంది. జాంబీస్ ఆ సెంటర్‌ను సరౌండ్ చేస్తాయి. దీంతో వాళ్ళు అక్కడే లాక్‌డౌన్‌లో చిక్కుకుని, జాంబీస్‌ నుంచి తప్పించుకోవడానికి, సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు.


కౌన్సెలర్ జాన్ (రోబిన్ నాస్‌లుంద్) వారిని గైడ్ చేస్తాడు. కానీ జాంబీస్ దాడులు ఎక్కువవుతాయి. కార్ల్ – వానిల్లా జాంబీస్‌తో ఫైట్ చేస్తూ, తమ మ్యారేజ్ ఇష్యూస్ (కమ్యూనికేషన్ గ్యాప్, ఈర్ష్య)ను సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎట్టకేలకు జాంబీస్ సెంటర్‌లోకి ఎంటర్ అవుతాయి. కార్ల్ – వానిల్లా వాటిని చంపడానికి వెపన్స్ (ఇంప్రొవైజ్డ్ వెపన్స్) ఉపయోగిస్తారు. చివరికి కౌన్సెలర్ జాన్ మరణిస్తాడు. వారు ఒంటరిగా మిగిలిపోతారు. క్లైమాక్స్‌ ఎమోషనల్ ఎండింగ్‌తో ముగుస్తుంది. మరి ఆ జంట చివరికి ఒక్కటయ్యారా ? అక్కడి నుంచి ఎలా బయట పడ్డారు? అనేది స్టోరీ.

Read Also : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

OTT Movie : ప్లే గ్రౌండ్ లో చెయ్యి లేకుండా అమ్మాయి శవం… చెస్ట్ నట్ బొమ్మతో క్లూ వదిలే సైకో కిల్లర్ కిరాతకం..

OTT Movie : దెయ్యాన్ని వదిలించడానికెళ్లి దానితోనే దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

OTT Movie : మ్యూజిక్ తో దెయ్యాన్ని నిద్రలేపే మెంటల్ పిల్ల… ఇలాంటి హర్రర్ మూవీని ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

OTT Movie : గోడ లోపల వింత శబ్దాలు… కట్ చేస్తే ఒళ్ళు జలదరించే ట్విస్ట్… ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా భయ్యా

Big Stories

×