OG Film : మరో ఎనిమిది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. చాలా సంవత్సరాలు తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్ట్రైట్ ఫిలిం కాబట్టి ఇది సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమా వచ్చినా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. మొత్తానికి మరికొన్ని రోజుల్లో అసలైన పవన్ విధ్వంసం చూడనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ (Ss Thaman) నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేశాడు. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ మాదిరిగానే చాలా సినిమాలకు ఈ సినిమా సమాధానం అన్నట్లుగానే మ్యూజిక్ ఉంది. సినిమాలో ఇంకెన్ని దాచి పెట్టారు అనేది తర్వాత తెలుస్తుంది.
ఓజి సినిమాలో ప్రియాంక అరుణ్ మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో కొన్ని సీన్స్ బాగా ఇంప్రవైజ్ చేశారు. రేపు ఒక సీన్ చేస్తున్నాము అంటే ముందు రోజే మంచి ప్రిపరేషన్ తో వస్తారు. అలానే డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని సీన్స్ ఇంప్రవైజ్ చేశారు అని చెప్పారు.
ప్రియాంక ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంత అలజడి మొదలైంది. పవన్ కళ్యాణ్ వేలుపెట్టి సినిమాను ఏం చేసేసాడు అని ఆందోళన పడిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందుకే సుజీత్ కి సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డెవలప్ చేసిన సీన్స్ అన్నీ పక్కన పెట్టేసి. నువ్వు మాత్రమే తీసిన సినిమా రిలీజ్ చెయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి సినిమాలు మీద ఉన్న ధ్యాస తగ్గింది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ఉన్న డెడికేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఖుషి (Khushi) సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే చాలా సీన్స్ అద్భుతంగా వచ్చాయి. ఆ సినిమాకి అంత బ్యూటీ కూడా వచ్చింది. మిగతా సినిమాల్లో అది వర్కౌట్ కాలేదనేది వేరే విషయం.
Also Read: NTR : ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, బాడీకి బుర్ర తగిలించినట్టు ఉంది అంటూ కామెంట్స్