Shahid Afridi : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది భారత దేశ రాజకీయాల పై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రధానంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై ప్రసంశల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ విజయం సాధించిన తరువాత టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టాస్ వేసే సమయంలో కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. నిబంధనలకు విరుద్ధంగా భారత్ వ్యవహరించిందని ఫిర్యాదు చేయగా.. ఐసీసీ రూల్స్ ప్రకారం.. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఏమి లేదని తేల్చి చెప్పింది. దీంతో పాక్ కి ఎదురు దెబ్బ తగిలింది.
Also Read : Robin Uthappa : క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ కు ఈడీ సమన్లు.. అతనికి కూడా..!
టీమిండియా క్రికెటర్లు కరచాలనం నిరాకరించిన వివాదం పై తాజాగా అఫ్రిది స్పందించాడు. ముఖ్యంగా భారత్ లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికే హిందూ-ముస్లీం కార్డు వాడుతుందని.. ఆరోపించాడు అఫ్రిది. “నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాను. ఇది చాలా చెడు మనస్తత్వం” అని పేర్కొన్నాడు. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయని అభిప్రాయ పడ్డాడు.” ఇక అదే సమయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఆకాశానికెత్తాడు అఫ్రిది. రాహుల్ గాంధీకి సానుకూల దృక్పథం ఉందని.. ఆయన చర్చల ద్వారా అందరితో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటున్నారు” అని ప్రశంసించారు.
“వాస్తవానికి పాకిస్తాన్ తో చర్చలకు రాహుల్ గాంధీ సుముఖంగా ఉన్నారని.. ఆసియా కప్ 2025 టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇందుకు నిరాకరించడమే ఈ వివాదానికి మూల కారణం అన్నారు. అయితే భారత ఆటగాళ్లను తాను తప్పు పట్టడం లేదన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి తరువాత భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని.. మ్యాచ్ ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిందని గుర్తు చేసాడు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో బీసీసీఐ మా ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయవద్దని టీమిండియా ఆటగాళ్లను ఆదేశించి ఉండవచ్చు. వారికి పై నుంచి ఆదేశాలు వచ్చాయి” అని పేర్కొన్నాడు అఫ్రిది. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారిగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు.. పాకిస్తాన్ పై మ్యాచ్ ను వన్ సైడ్ గా ఆడారు. పాకిస్తాన్ అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో ఎందులో కూడా పోటీ ఇవ్వలేకపోయింది.