E-Paper
Advertisement

GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!

GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!
Advertisement

GHMC: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి సర్కారు ఓ పనైపోయిందని భావిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ, కార్పొరేషన్లకు మున్ముందు ఆర్థిక కష్టాలు తప్పని పరిస్థితులు నెలకున్నట్లు చర్చ జరుగుతుంది. రూ.1860 కోట్ల నిధులతో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల ఏర్పాటైన రెండు కార్పొరేషన్లకు మొత్తం ఆస్తులు, అప్పులను పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ రానున్న మార్చి నెలాఖరు వరకు డెడ్ లైన్ విధించుకున్నట్లు తెలిసింది.

తొలుత రూ. 500 కోట్లు..

రెండు కార్పొరేషన్ల విస్తీర్ణం, ఆదాయం, ఆస్తులను పంపిణీ చేసే బాధ్యతను జీహెచ్ఎంసీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు అప్పగించినట్లు సమాచారం. కోర్ అర్బన్ రీజియన్ ఏరియాకు స్పెషలాఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జయేష్ రంజన్ తొలి రోజే స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లకు ఒక్కోదానికి తొలుత రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెల్సిందే. కానీ స్పెషలాఫీసర్ ప్రకటించిన రూ. 500 కోట్లను జీహెచ్ఎంసీ నిధుల నుంచి కేటాస్తారా? లేక ప్రభుత్వం కేటాయిస్తుందా? అన్న స్పష్టత లేదు. ఒక వేళ జీహెచ్ఎంసీ నిధుల నుంచే సర్కారు నుంచో ఈ నిధులను కేటాయించినా, జీహెచ్ఎంసీ తరహాలోనే రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పన, పౌర, అత్యవసర సేవల నిర్వహణ చేపట్టేందుకు ఆ నిధులు ఏ మాత్రం సరిపోవన్న వాదనలున్నాయి.

అప్పటి వరకు చెల్లింపులన్నీ జీహెచ్ఎంసీ నుంచే..

Advertisement

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) లో ఇంకా మిగిలి ఉన్న దాదాపు నెలన్నర రోజుల పాటు రెండు కార్పొరేషన్ల ఉద్యోగుల జీతభత్యాలు, పౌర సేవల వ్యయంతో పాటు ఆఫీసు వ్యయం కూడా జీహెచ్ఎంసీయే చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో భవన నిర్మాణ అనుమతులకు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కూడా మొత్తం జీహెచ్ఎంసీ ఖాతాలోనే జమ చేస్తున్నట్లు తెలిసింది. కొత్త కార్పొరేషన్లకు మార్చి నెలాఖరు తర్వాత సరి కొత్త ఖాతాలను తెరవనున్నట్లు తెలిసింది.

Also Read: OTT Movie: చిన్నప్పుడు చేసిన తప్పుకి శిక్ష.. సన్ నెక్ట్స్‌లో దుమ్మురేపుతోన్న చిన్న చిత్రం!

తుది నిర్ణయం సర్కారుదే..

Advertisement

జీహెచ్ఎంసీకి ఉన్న రూ. 4786 కోట్ల అప్పుల పంపకాల విషయంలో సర్కారుదే తుది నిర్ణయమని తెల్సింది. జీహెచ్ఎంసీ చేసిన అప్పుతో జీహెచ్ఎంసీ పాత పరిధి 650 కిలోమీటర్ల పరిధిలోనే వివిధరకాల అభివృద్ది పనులు చేపట్టినందున, ఈ అప్పుతో విలీనం పట్టణ స్థానిక సంస్థలకు ఏ మాత్రం సంబంధం లేదని, అప్పుల్లో వాట ఎలా కేటాయిస్తారంటూ విలీన సంస్థల్లోని రాజకీయ, అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తుల పంపకాల విషయంలో అధికారులే కీలక నిర్ణయం తీసుకుని పంచే అవకాశాలున్నా, అప్పుల పంపకాల విషయంలో సర్కారే నిర్ణయమే కీలకం కానున్నట్లు సమాచారం.

నేటి నుంచి ప్రజావాణి..

కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన తెలిపారు. మాదాపూర్ లోని న్యాక్ భవనంలోని మొదటి అంతస్తులో ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఉదయం పదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించి, ప్రజల నుంచి తానే నేరుగా ఫిర్యాదులు, విన్నపాలు స్వీకరించనున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. ఇకపై ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Also Read: Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ 4 మిస్ చెయ్యకండి..

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×