E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న అభి.. టెన్షన్ లో పల్లవి.. అయ్యో.. అభి పరిస్థితి సీరియస్..

Intinti Ramayanam Today Episode: నిజం తెలుసుకున్న అభి.. టెన్షన్ లో పల్లవి.. అయ్యో.. అభి పరిస్థితి సీరియస్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. భూత వైధ్యుడుని తీసుకొచ్చిన అవని ఎలాగైనా సరే.. ఈ హత్య చేయాలని ఎవరనుకుంటున్నారో తెలియాలని అనుకుంటుంది.. అందరూ నిమ్మకాయలు కట్ చేస్తే పల్లవి మాత్రం కట్ చేయడానికి కాస్త ఆలోచిస్తుంది. ఈ నిమ్మకాయ గనుక నేను ఇస్తే అది ఎర్రగా ఉంటే నేనే ఇదంతా చేశాను అని తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతుంది. దీని నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని ఆలోచిస్తుంది. అప్పుడే సడన్ గా దెయ్యం పట్టినట్లు యాక్ట్ చేస్తుంది.. పల్లవికి సడన్గా ఇలా దెయ్యం పట్టడం ఏంటి అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవికి నిజంగానే దెయ్యం పట్టిందో లేదో అని తెలుసుకోవడానికి అవని ప్రయత్నాలు చేస్తుంది.. అక్కడున్న వాళ్ళందరూ నిజంగానే పల్లవికి దెయ్యం పట్టిందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు.

అయితే భానుమతి భూత వైద్యుడు గారు నా మనవరాలుకి ఏదో దెయ్యం పట్టినట్లుంది దాన్ని వెంటనే వదిలించండి అని రిక్వెస్ట్ చేస్తుంది.. ఇక అవని పర్మిషన్ ఇవ్వడంతో అతను నేను ఇక్కడ ఉండగానే నువ్వు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చావా నీ సంగతి చెప్తాను అని అంటాడు. కానీ పల్లవి మాత్రం అతన్ని తోసి కింద పడేస్తుంది. అయితే భానుమతి దాన్ని కొట్టి బయటికి పంపించండి అని అంటుంది.. ఇక అవని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూత వైద్యుడు రెచ్చిపోతాడు.. పల్లవిని చితక్కొడతాడు. కానీ పల్లవి మాత్రం తనకి నిజంగానే దెయ్యం పట్టింది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అవని పల్లవి నాటకం ఆడుతుంది అని అనుకుంటుంది. అనుమానమే నిజమైనట్టుంది. అందరూ నిమ్మకాయని కొయ్యగా పల్లవి మాత్రం కొయ్యకుండా ఇలా దెయ్యం పట్టినట్లు నాటకం ఆడుతుందా అని ఆలోచిస్తుంది. అయితే పల్లవిని లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పల్లవి నొప్పులతో బాధపడిపోతూ ఉంటుంది.. అయితే కమల్ వేడి నీళ్లు తీసుకొని వెళ్లి ఇస్తాడు. ఆ తర్వాత భానుమతి వచ్చి జండుబాం ఇస్తుంది.. ఏంటే ముసలి అప్పుడేమో కొట్టు కొట్టు అని కర్ర తెచ్చి ఇచ్చావు ఇప్పుడేమో జండుబాం రాసుకొని అంటున్నావా నీకు కొంచమైనా ఉందా అని పల్లవి అంటుంది. ఎవరికైనా దెయ్యం పడితే అప్పుడు ఏం జరిగిందో గుర్తుకురాదు. కానీ పల్లవికి మాత్రం జరిగింది గుర్తుందీ అంటే కచ్చితంగా ఇది నాటకమే అని అవని కన్ఫామ్ చేసుకుంటుంది.. మావయ్యను తోసి చంపేయాలనుకునింది పల్లవిని నా అనుమానమే నిజమైతే ఆ తర్వాత పల్లవిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అవని అనుకుంటుంది.

ఆ తర్వాత అభి కి కానిస్టేబుల్ సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకొచ్చి ఇస్తాడు.. అది చూసిన అవి షాక్ అవుతాడు. ఈ విషయాన్ని ఎలాగైనా సరే ముందు అవనికి చెప్పాలని అనుకుంటాడు.. అయితే ఆ ఫుటేజ్ ని చూసిన అవభి వెంటనే అవి దగ్గరికి బయలుదేరుతాడు. అయితే కానిస్టేబుల్ పల్లవికి ఈ విషయాన్ని చెప్తాడు.. పల్లవి షాక్ అవుతుంది.. పల్లవికి కానిస్టేబుల్ ఈ విషయం చెప్పగానే అతని ఏదో ఒకటి చేసి తన పేరు బయటికి రానివ్వకుండా చూసుకోవాలని అనుకుంటుంది.. ఆ తర్వాత అవని అందరిని ఇంట్లోంచి పిలుస్తుంది..

Advertisement

ఏమైందే ఎందుకు అలా అరుస్తున్నావు అని భానుమతి అడుగుతుంది.. అయితే ఎస్ఐ అభిరామ్ గారు నాకు ఫోన్ చేశారు. మరో సిసి టీవీ ఫుటేజ్ దొరికిందట.. అందులో మావయ్య గారిని హత్య చేయాలనుకున్న వాళ్ళు ఎవరో ఉంది అని ఆయన అన్నారు. ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అని అవని అంటుంది.. అయితే అవని మాట వినగానే పల్లవి షాక్ అవుతుంది.. తన ప్లాంట్ ప్రకారం అభిని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది.. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సేపు అభి కోసం వెయిట్ చేస్తారు.. అభి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.

అయితే ఏంటి ఇంకా రాలేదు అని భానుమతి అడగగానే.. అది నాకు అర్థం కావట్లేదు అమ్మమ్మ గారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదు అని అంటుంది. అయితే పల్లవి నాకు మాత్రం బాగా అర్థమైంది నీ వల్లే మావయ్య గారు ఇలా పడిపోయారు. అది నువ్వు నీ నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నావా అని పల్లవి అంటుంది.. నేనేం నాటకాలు ఆడుతున్నాను. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి ఎవరు నాటకాలు ఆడుతున్నారో మరి కాసేపట్లో తెలుస్తుంది కదా.. నువ్వు నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని అవని అంటుంది..

ఇక అభి కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు అని అవని అక్షయ్ ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అవనికి అభి ఫోన్ నుంచి ఒక ఫోన్ రావడంతో అతనికి యాక్సిడెంట్ అయింది అని తెలుసుకుంటుంది.. అక్షయ్ అవని ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.. అక్కడ ఆచేతనంగా పడి ఉన్న అభిని చూసి షాక్ అవుతారు. ఇదంతా మన వల్లే జరిగింది మనకి మంచి చేద్దామని చూసిన అభిగారికి ఇలా జరగడం బాధగా ఉంది అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనకి మంచి చేయాలని వచ్చిన వాడికి ఇలాంటి పరిస్థితి ఎదురడం నాకు చాలా బాధగా ఉంది అని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు.

Also Read :శ్రీవల్లికి అనుమానం.. సాగర్ పై ఫోకస్ పెట్టిన భాగ్యం.. ప్రేమ ఎస్సై అవుతుందా..?

బయట అవి ఇలాంటి పరిస్థితి జరగడం గురించి అవని అక్షయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే అభి గారికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే అని అవని అంటుంది.. ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావో అవని అని అక్షయ్ అడుగుతాడు.. ఏమీ లేదండి మీకు చాలా కాలం నుంచి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. అన్నిటికి అదే కారణమని నాకు అనిపిస్తుంది అని అవని అంటుంది. మీకు నా కన్నతండ్రి గురించి తెలిసిన నిజం చెప్పలేదు అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. అసలు నా కన్నతండ్రి ఎవరో కాదు ఆ చక్రధరని అవని అక్షయకు నిజం చెప్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×