Thriller Movie on OTT : పెళ్ళయ్యాక ఆ మధుర క్షణాలను లైఫ్ టైమ్ మెమరీగా మార్చుకోవడానికి భార్యాభర్తలు కొన్ని ప్లాన్స్ చేసుకుంటారు. అందులో భాగంగానే హనీమూన్ కు కూడా వెళతారు. కానీ అదే హనీమూన్ డెడ్లీ డెత్ గేమ్ గా మారితే… ఎలా ఉంటుందో తెలియాలంటే ‘టేబుల్ నంబర్ 21’ (Table No. 21) మూవీపై ఒక లుక్కేయాల్సిందే. లైవ్ గేమ్ షోలో హనీమూన్ కి వచ్చిన దంపతులకు ఏమైంది ? ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
వివాన్, సియా మధ్యతరగతి దంపతులు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా లక్కీ డ్రాలో ఫిజీ దీవులకు ఉచిత లగ్జరీ ట్రిప్ గెలుచుకుంటారు. ఆ ట్రిప్ సమయంలో ఆ రిసార్ట్ యజమాని మిస్టర్ ఖాన్ వాళ్ళను కలుస్తాడు. అతను వాళ్ళ ముందు ఒక లైవ్ రియాలిటీ గేమ్ షో ప్రతిపాదనను ఉంచుతాడు. గేమ్ ఏంటంటే… కేవలం 8 ప్రశ్నలు, నిజం మాత్రమే చెప్పాలి, ఆ టాస్క్ లు పూర్తి చేయాలి. గెలిస్తే 21 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుందని ఆశపెడతాడు. డబ్బుపై ఆశతో వివాన్, సియా ఆట ఆడటానికి ఒప్పుకుంటారు.
మొదట కొన్ని ప్రశ్నలు సరదాగా, తేలికపాటి ఎమ్బరాస్‌మెంట్‌తో సాగుతాయి. కానీ క్రమంగా మిస్టర్ ఖాన్ అడిగే ప్రశ్నలు వాళ్ళ వ్యక్తిగత జీవిత రహస్యాలను, వారి కాలేజీ గతాన్ని, చేసిన తప్పులను గుర్తు చేసేలా ఉంటాయి. ఆట నుండి తప్పుకుంటే ప్రాణాలు పోతాయనే రూల్ పెట్టడంతో అది కాస్తా డెత్ గేమ్ గా మారుతుంది. సినిమా మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను షాక్ చేస్తాయి. మిస్టర్ ఖాన్ మరెవరో కాదు. కాలేజీ రోజుల్లో వివాన్, సియా చేసిన విపరీతమైన ర్యాగింగ్ వల్ల మానసిక సమతుల్యత కోల్పోయి, నడవలేని స్థితికి చేరిన అక్రమ్ అనే విద్యార్థి తండ్రి.
తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిన వారికి బుద్ధి చెప్పడానికే ఖాన్ వారిని ఫిజీకి రప్పించి, ఈ మైండ్ గేమ్ ఆడతాడు. సినిమాలోని ట్విస్టులు, సస్పెన్స్, ఎమోషనల్ సీక్వెన్స్‌లు ఆకట్టుకుంటాయి. మరి ఇంతకీ ఈ డెత్ ట్రాప్ నుంచి హీరో హీరోయిన్ బయటపడ్డారా ? అసలు వాళ్ళు ఆడిన గేమ్స్ ఏంటి ? చివరకి ఏమైంది ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
Also Read : 25 ఏళ్ల సీక్రెట్ లవ్ తెచ్చిన చిక్కులు… రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్
బాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘టేబుల్ నెంబర్ 21. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కును కథలో కలిపి, భయంకరమైన మైండ్ గేమ్ ద్వారా ప్రేక్షకులకు షాక్ చేస్తుంది. ర్యాగింగ్ వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచింపజేసే సినిమా. ఇప్పుడు ZEE5, Amazon Prime Video, YouTubeలలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ లేదు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.