E-Paper
Advertisement

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌
Advertisement

Crime Thriller: డబ్బు అవసరమైనప్పుడు సులభంగా సంపాదించే అవకాశం కనిపిస్తే… చాలామంది ఒక్క క్షణం కూడా ఆలోచించరు. అప్పులు తీర్చుకోవాలన్నా, కుటుంబాన్ని ఆదుకోవాలన్నా, తమ కలలను నిజం చేసుకోవాలన్నా డబ్బు కావాలి. అందుకోసం ఏదో ఒక దారి వెతుకుతుంటారు. అయితే కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశలో తప్పు దారిలో అడుగు పెడితే పరిస్థితులు ఎంత దారుణంగా మారతాయో ఊహించగలమా ? నలుగురు స్నేహితులు ఇలాంటి ఆశతో మొదలు పెట్టిన ప్రయత్నం వారి ప్రాణాల మీదకు తెచ్చే కథే ‘4 ఇడియట్స్’ (4 Idiots). మరి ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవొచ్చు ? కథ ఏంటి ? అంటే…

కథలోకి వెళ్తే…

చెన్నైలో నలుగురు యువకులు చిన్నచిన్న నేరాలు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. కింగ్, క్వీన్, జాక్, ఏస్ వాళ్ళ పేర్లు. వీరికి పెద్దగా స్థిరమైన ఆదాయం ఉండదు. ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నా, జీవితాన్ని మార్చే సరైన అవకాశం మాత్రం దొరకదు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా నిలిచిపోవడంతో వారి సంపాదనకు కూడా గండి పడుతుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న వీరికి రొటీన్ ఖర్చులు కూడా భారంగా మారతాయి.

Advertisement

అలాంటి సమయంలో కింగ్‌కు ఓ బంగ్లాలో పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉందనే సమాచారం తెలుస్తుంది. అక్కడ ఒంటరిగా ఓ వాచ్‌మన్‌ కాపలా ఉంటాడని తెలుసుకున్న నలుగురూ, ఇదే తమ అదృష్టాన్ని మార్చే అవకాశమని భావిస్తారు. పెద్దగా ప్రమాదం ఉండదని అనుకుంటూ బంగ్లాలోకి ప్రవేశిస్తారు. అయితే లోపలికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. బయటకు వెళ్లే దారి మూసుకుపోవడంతో పాటు, అక్కడ ఉన్న వ్యక్తి సాధారణ కాపలాదారుడు కాదని తెలుస్తుంది.

అతడే పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ పులిబాబా. అతని చేతిలో చిక్కుకున్న నలుగురికి తాము ఆశించిన డబ్బు కంటే పెద్ద ప్రమాదం ఎదురైందని అర్థమవుతుంది. పులిబాబా అక్రమంగా మనుషుల అవయవాలను సేకరించే భయంకరమైన వ్యాపారం చేస్తాడు. అతని మాటల్లోనే తమను వైద్యుడి దగ్గరకు పంపించేందుకు సిద్ధం చేస్తున్నారనే విషయం బయట పడుతుంది. కిడ్నీల కోసం మనుషులను సరుకుల్లా చూసే ఈ ముఠా నుంచి బయట పడటానికి నలుగురూ ఎలాంటి ప్లాన్ చేస్తారు ?. డబ్బు కోసం మొదలైన దొంగతనం, ప్రాణాలు కాపాడుకోవాల్సిన పోరాటంగా మారితే నెక్స్ట్ ఏం జరుగుతుంది ? క్లైమాక్స్ ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

‘4 ఇడియట్స్’ చిత్రం తమిళ క్రైమ్ థ్రిల్లర్. సింప్లీసౌత్‌ ఓటీటీలో ప్రస్తుతం తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సాజో సుందర్ (Sajo Sundar) రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పుగళ్ (Pugazh), విన్సెంట్ అశోకన్ (Vincent Ashokan), కుంకి అశ్విన్ (Kumki Ashwin), రవి మరియా (Ravi Mariya) తదితరులు నటించారు. క్రైమ్‌, బ్లాక్ కామెడీ, సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఆసక్తికరంగా అనిపించవచ్చు.

Read Also: సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

Related News

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

Big Stories

Advertisement
×