BigTV English
Advertisement

OTT Movie : అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిలను టచ్ చేయకుండానే అత్యంత కిరాతకంగా చంపే సైకో… ట్విస్టులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కొన్ని సైకో కిల్లర్ సినిమాల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయి. అయితే అదేంటో గానీ చాలా సినిమాలలో ఈ నరరూప రాక్షసులు అమ్మాయిలనే టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. ఇక ఇలాంటి సినిమాలు సీను సీనుకో ట్విస్ట్ తో ఆద్యంతం ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ గురించే తెలుసుకుందాం.


ఓటీటీ రిలీజ్ కు దక్కని మోక్షం
ఈ వివాదాస్పద మూవీ పేరు ‘డీ3’ (D3). కుర్తాళంలోని డీ3 పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్, ఒకే రోజు జరిగిన ఒక హత్య, ఒక మిస్సింగ్ కేసు, ఒక యాక్సిడెంట్‌ను ఛేదిస్తూ, ఒక షాకింగ్ మెడికల్ క్రైమ్‌ను బయటపెడతాడు. “డీ3” 2023లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో సస్పెన్స్, మిస్టరీ, డ్రామా కావలసినంత ఉంటుంది.ఈ చిత్రంలో ప్రజిన్ (విక్రమ్), విద్యా ప్రదీప్ (మాయ), చార్లె, రాహుల్ మాధవ్, అభిషేక్ కుమార్, వర్గీస్ మాథ్యూ, గాయత్రి యువరాజ్, మరియు అరౌల్ డి. శంకర్ (సెంథమరై) నటించారు. “డీ3” 2023 మార్చి 17న థియేటర్లలో విడుదలైంది, కానీ ప్రస్తుతం ఇది ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేదు. ఈ మూవీ థియేటెటర్లలో రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్ళు గడుస్తున్నా లీగల్ ఇష్యూస్ కారణంగా ఓటీటీలోకి రాలేదు.

Read Also : ఆడ వేషాలు వేస్తూ నిజంగానే అమ్మాయిలా… మరి లవర్ పరిస్థితి ఏంటి?


కథలోకి వెళ్తే
కుర్తాళంలోని డీ3 పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ గా విక్రమ్ (ప్రజిన్) పని చేస్తున్నాడు. ఒకే రోజు ఒక గృహిణి మిస్సింగ్ కేసు వస్తుంది. అలాగే అదే రోజు ఒక హత్య జరుగుతుంది, ఒక విచిత్రమైన యాక్సిడెంట్ సంభవిస్తుంది. ఈ మూడు కేసులు ఒక విచిత్రమైన ట్రాక్ ను ఫాలో అవుతున్నట్టు విక్రమ్ గుర్తిస్తాడు. బాధితులందరూ ఒక మిస్టీరియస్ ఫోన్ కాల్‌ లో మాట్లాడి, దాని ఆదేశాలను అనుసరించి, ఆ తరువాత చనిపోతారు. విక్రమ్ ఈ కేసులను లోతుగా ఇన్వెస్టిగేట్ చేయగా, 203కు పైగా ఇలాంటి కేసులు “యాక్సిడెంట్‌లు”గా క్లోజ్ అయ్యాయని తెలుసుకుంటాడు. అతను చేసే ఈ దర్యాప్తు ఒక షాకింగ్ మెడికల్ క్రైమ్‌కు దారితీస్తుంది. ఇందులో రాజకీయ ప్రముఖులు, ఒక హూలిగాన్ సెంథమరై (అరౌల్ డి. శంకర్)లకు లింక్‌లు ఉన్నాయని తెలుస్తుంది. విక్రమ్ ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని భార్య మాయ (విద్యా ప్రదీప్) కూడా ప్రమాదంలో పడుతుంది. మరి ఆ టైమ్ లో భార్యను రక్షించుకోవడానికి హీరో ఏం చేశాడు ? ఇంతకీ ఫోన్ చేసి ఇంతమందిని ఎలా చంపారు? చివరికి హీరో నిందితులను పట్టుకోగలిగాడా? అన్నది తెరపై చూడాల్సిందే.

Tags

Related News

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా

OTT Movie : ఇంటికొచ్చిన అబ్బాయిని టెంప్ట్ చేసి ఆ పని… కనక వర్షం కోసం మైండ్ బెండింగ్ క్రైమ్ ప్లాన్

OTT Movie : బ్లడీ బ్లడ్ గేమ్… చావు లేదా బతుకు రెండే ఆప్షన్స్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : భార్యనే ఛీటింగ్ చేసే భర్త… ఒకే ఒక్క బుక్ తో ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

Big Stories

×