BigTV English

OTT Movie : ఆడ వేషాలు వేస్తూ నిజంగానే అమ్మాయిలా… మరి లవర్ పరిస్థితి ఏంటి?

OTT Movie : ఆడ వేషాలు వేస్తూ నిజంగానే అమ్మాయిలా… మరి లవర్ పరిస్థితి ఏంటి?

OTT Movie : కొంతమంది తాము చేసే పనికి అల్మోస్ట్ అడిక్ట్ అయిపోతారు. అలాగే మరికొంత మంది అవసరం కోసమో లేదా ఇతర కారణాల వల్లనో లేడీ గెటప్స్ వేస్తూ వేస్తూ, చివరికి అలాగే మారివడం వంటి విషయాలను ఇప్పటికే మనం విన్నాము. ఇలాంటి స్టోరీ లైన్ తో తెరకెక్కిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అన్న విషయాలను తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘జమా’ (Jama). కళ్యాణం అనే యువ కూతు కళాకారుడు తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూ, ప్రత్యర్థుల ఒత్తిడి, ప్రేమ, తల్లి ఆశలు, సొంత సృజనాత్మక మార్గం వంటి విషయాల్లో కొట్టుమిట్టాడతాడు. “జమా” మూవీ 2024లో విడుదలైన తమిళ డ్రామా. సాంప్రదాయ తెరుకూతు (స్ట్రీట్ థియేటర్) కళాకారుల జీవితాలను తెరపై హార్ట్ టచింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. సాంస్కృతిక, సామాజిక అంశాలను, ముఖ్యంగా లింగ పాత్రలు, సమాజ అంచనాలు, కళాకారుల పోరాటాలను టచ్ చేస్తూనే, ఎమోషనల్ కథనం, గ్రామీణ నేపథ్యం, తెరుకూతు కళ సౌందర్యాన్ని విజువల్‌గా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పరి ఎలవజగన్ (కళ్యాణం), అమ్ము అభిరామి (జెగ), చేతన్ (తండవం), శ్రీ కృష్ణ దయాళ్, కెవిఎన్ మణిమేగలై, వసంత మరిముత్తు, సివ మారన్, ఎ.కె. ఎలవజగన్ నటించారు. ఈ మూవీ గత ఏడాది ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
తిరువణ్ణామలైలోని పళ్ళికొండపట్టు గ్రామంలో, కళ్యాణం (పరి ఎలవజగన్) రామచంద్రన్ నాటక సభ అనే 16 మంది సభ్యుల తెరుకూతు బృందంలో భాగంగా ఉంటాడు. అతను మహాభారత నాటకాలలో ద్రౌపది వంటి స్త్రీ పాత్రలను పోషిస్తాడు. ఈ బృందాన్ని మొదట అతని తండ్రి ఎలవరసన్ (శ్రీ కృష్ణ దయాళ్) స్థాపించగా, ప్రస్తుతం దాన్ని తాగుబోతు అయిన తండవం (చేతన్) నడిపిస్తున్నాడు. స్త్రీలాంటి ప్రవర్తన, గ్రామ మహిళలతో కలిసిపోవడం, ద్రౌపది పాత్రను పోషించడం వల్ల కళ్యాణంను చాలామంది ఎగతాళి చేస్తారు. ఈ ఎఫెక్ట్ అతని పెళ్ళిపై పడుతుంది. హీరో తల్లి (కెవిఎన్ మణిమేగలై) అతను తన తండ్రిలాగా అర్జున వంటి పురుష పాత్రలను పోషించాలని కోరుకుంటుంది.


Read Also : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?

కళ్యాణం, తండవం కుమార్తె జెగ (అమ్ము అభిరామి)తో ప్రేమలో ఉంటాడు. కానీ తండవం వీళ్ళ ప్రేమకు అడ్డు చెబుతూ, అతన్ని అవమానిస్తాడు. జెగ తన తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కళ్యాణం తన కళపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ బాధ్యలో ఉన్న హీరోకి తన తండ్రి గురించి, వారసత్వంగా రావలసిన ఈ డ్రామా టీం గురించి ఓ షాకింగ్ ట్విస్ట్ వెళ్లడవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? అధికారికంగా హీరోకి చెందాల్సిన ఈ డ్రామా కంపెనీ హీరోయిన్ తండ్రి చేతికి ఎలా వెళ్ళింది ? అన్నది స్టోరీ.

Related News

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Big Stories

×