Gundeninda GudiGantalu Today episode july 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా ఇంటికి వస్తే ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుంది. చేసినంత చేసి మల్ల ఇంటికి ఏ మొహం పెట్టుకొని వచ్చారు అని ప్రభావతి బాలు పై రెచ్చిపోయి మాట్లాడుతుంది. అంత పెద్ద మనిషిని అంత మంది ముందర కొడితే ఎవరికైనా కోపం రాదా అసలు కొట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది. ఆయన చేసిన తప్పేంటి అత్తయ్య అని మీనా అంటుంది. ఈ గొడవన్నటికీ కారణం నువ్వేనే నీవల్లే వాడు కొట్టాల్సి వచ్చింది అని మీనా పై కూడా సీరియస్ అవుతుంది ప్రభావతి. ఇంటి కోడల్ని ఒకడు వచ్చి దారుణంగా మాట్లాడుతుంటే వారిని నాలుగు పీకాల్సింది పోయి నన్ను మీరు అంటున్నారని మీనా ఫీల్ అవుతుంది.
అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు మళ్లీ మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి అని మీనా అంటుంది. మీనా అన్నదాంట్లో తప్పేంటి అని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇంటి కోడల్ని అంటుంటే నాకే ఒళ్ళు మండిపోయింది అలాంటిది కట్టుకున్న భార్యను ఒకడు వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా ఒళ్ళు మండకుండా ఉంటుందా అందుకే వాడు కొట్టాడు. దాంట్లో తప్పేమీ లేదు అని సత్యం అంటాడు.. మొత్తానికి ప్రభావతి సత్యం వల్ల బాలు మీనాని ఇంట్లో ఉండనిచ్చేందుకు ఒప్పుకుంటుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి ఈ వయసులో మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావా ఆయన లేనిది నేను ఉండను అని అంటుంది.. మొత్తానికైతే బాలు మీనా ఇంట్లో ఉండడానికి ప్రభావతి ఒప్పుకుంటుంది. రవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే శోభా సురేంద్ర ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు. అటు సంజయ్ మౌనికను పిలిచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్లయిన తర్వాత ఇన్ని రోజులకి ఇంత హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా అని అంటాడు. ఏమైందండీ ఎందుకు అని అంటే ఇది నీకు బ్యాడ్ న్యూస్ కావచ్చు అని మౌనికతో అంటాడు సంజయ్. మీ ఇంట్లో వాళ్ళు గొడవపడ్డారు అంట ఫంక్షన్ ఆగిపోయింది అంట అని అనగానే మౌనిక ఫీల్ అవుతుంది.
రవి శృతి వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్సి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ తనతో పాటు పనిచేస్తున్న మరొక చెప్పు రవి ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగితే ఏం ఫంక్షన్ ఏం చెప్పాలి అది తర్వాత మాట్లాడుకుందాం లే అని చిరాగ్గా అంటాడు. ఏమైందిరా అలా ఉన్నావు ఏం జరిగింది అంటే పెళ్లయిన తర్వాత ఇలాంటి బాధలుంటాయని తెలిస్తే నేను అసలు పెళ్లి చేసుకోను అని రవి అంటాడు.. అసలేం జరిగింది ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అతని ఎంత అడిగినా రవి మాత్రం నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా నువ్వు అసలు పెళ్లి చేసుకోవద్దు అని అంటాడు.
పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాల మధ్య నలిగి పోవాల్సి వస్తుందని నాకు అస్సలు తెలియలేదు అందుకే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు మాత్రం అస్సలు పెళ్లి చేసుకోకు అని ఉచిత సలహాలు ఇస్తాడు. ఇక అందరూ భోజనానికి కూర్చుంటారు ప్రభావతి మాత్రం అందరినీ కోపంగా చూస్తూ ఉంటుంది. మీనా వచ్చి భోజనం చేద్దాం రండి అత్తయ్య అని అన్నా కూడా మాట్లాడొద్దు నాతో అని సీరియస్ గా ఉంటుంది. ఆ తర్వాత సత్యం వచ్చి బలవంతంగా ప్రభావతిని భోజనానికి కూర్చోబెడతాడు.
బాలు రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి అలానే ఈ విషయం తెలుసుకొని మళ్లీ మలేషియా కి వెళ్ళాడేమో అని గుర్తు చేస్తాడు. దాంతో ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా మీ నాన్న ఎక్కడ అని రోహిణిని అడుగుతారు. ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి అడగడంతో దొరికిపోయానని టెన్షన్ పడుతూ రోహిణి కొత్త నాటకం మొదలు పెడుతుంది. తనకు వాంతులు అవుతున్నాయని బయటికి వెళ్లి వాంతి చేసుకుంటుంది. ప్రభావతి నిజంగా ప్రెగ్నెంట్ అయిందేమో అని చాలా సంతోషంగా ఉంటుంది.
లేటుగా పెళ్లి అయినా వీళ్ళిద్దరే తొందరగా తల్లిదండ్రులు కాబోతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనుకుంటుంది. ఇంట్లో పెద్ద హడావిడి చేస్తుంది. టెస్ట్ చేయించుకోమని హాస్పిటల్ కి పంపిస్తుంది. మనోజ్ మాత్రం తనకి జాబ్ లేదు కదా ఇప్పుడే పిల్లల్ని కంటే లేనిపోని ఖర్చులు ఉంటాయని రోహిణితో అంటాడు. ఇక రోహిణి విజ్జి కి అసలు నిజం చెప్పేస్తుంది. మా నాన్న గురించి అడుగుతుంటే ఈ నాటకం మొదలుపెట్టాను ప్రస్తుతం అయితే ఇది నన్ను సేవ్ చేసింది అని అంటుంది.
మామిడికాయలను చూసినా ప్రభావతి మీనా అని పిలిచి లోపల పెట్టమని అరుస్తుంది. బయటకు వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. కామాక్షి బామ్మర్ది ఇంట్లోకి వస్తుంది. అన్నగారు మీరు తాతయ్య కాబోతున్నారు వదినా నువ్వు బామ్మ కాబోతున్నావు అంటూ గంపెడు మామిడికాయలు తీసుకొని వస్తుంది. మామిడికాయలను చూసినా ప్రభావతి మీనా అ పిలిచి లోపల పెట్టమని అరుస్తుంది. ప్రభావతి చేయి తల్లికి మామిడికాయలు కింద పడటంతో అక్కడికొచ్చిన మీనా మామిడికాయ మీద కాలు వేసి జారి పడబోతుంది. బాలు పట్టుకుంటాడు కామాక్షి వాళ్ళ కన్నా ముందు వీళ్ళు కూడా తల్లిదండ్రులకు కాబోతున్నారేమో అని అంటుంది.
Also Read : ఇనయా జామకాయలను అడిగిన నెటిజన్.. మినిమమ్ పీహెచ్‌డీ..
ట్రిప్పు ట్రిప్పు అంట ఊరంతా తిరగకపోతే నీకు భార్య కడుపులో ఒక కాయనుగా కాపించొచ్చుగా కానీ కామాక్షి బాలుతో అంటుంది.. దానికి బాలు అర్ధరాత్రి విజిల్ వేసుకుంటూ ఊదుకుంటూ తిరుగుతూ ఉంటే కాయలు ఎక్కడ కాస్తాయి నీ మొహం అనేసి అంటాడు. హాస్పిటల్ కి వెళ్ళిన రోహిణి మన ఇంటికి వస్తారు అయితే రోహిణి ఏంటమ్మా గుడ్ న్యూస్ అని అడిగితే లేదు అత్తయ్య అని అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…