E-Paper
Advertisement

OTT Movie : ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు… భర్తకి ముప్పతిప్పలు… చూస్తే నవ్వులే నవ్వులు

OTT Movie : ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు… భర్తకి ముప్పతిప్పలు… చూస్తే నవ్వులే నవ్వులు
Advertisement

OTT Movie : ఈ రోజుల్లో ఒక మనిషి ఒక భార్యతో వేగడం చాలా కష్టం. అలాంటిది ముగ్గురు భర్యలతో ఒక మనిషి ఎలా బతికాడు అన్న కాన్సెప్ట్ తో ఒక మరాఠీ మూవీ వచ్చింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మరాఠీ స్టైల్ ఫ్యామిలీ కామెడీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? ముగ్గురు పెళ్లాలతో ఒక భర్త ఎలా బతికాడు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2012లో విడుదలైన ఈ మరాఠీ కామెడీ సినిమా పేరు ‘టీన్ బాయ్కా ఫజితీ ఐకా’ (Teen Bayka Fajiti Aika). రాజు పార్సేకర్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందింది. ఇందులో మకరంద్ అనస్పూర్ (విశ్వాసరావ్– హీరో), నిషా పరులేకర్ (ప్రజక్తా – మొదటి భార్య), క్రాంతి రెడ్కర్ (మాధవి – రెండవ భార్య), తేజశ్రీ (పారి – మూడవ భార్య) లీడ్ రోల్స్ లో నటించారు. 2 గంటలు 15 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2012 మార్చి 23 థియేట్రికల్ రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విశ్వాసరావ్ మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో తన భార్య ప్రజక్తాతో సంతోషంగా ఉంటాడు. భార్య చాలా ట్రెడిషనల్, విశ్వాసరావ్ కి గౌరవం ఎక్కువగా ఇస్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లి అయి 5 ఏళ్లు అయినా పిల్లలు లేరు. ఇంట్లో అత్తగారు, మామగారు, బంధువులు ప్రజక్తాని రోజూ పిల్లల గురించి ఇబ్బంది పెడుతుంటారు. దీంతో విశ్వాసరావ్‌కి కూడా స్ట్రెస్ పెరుగుతుంది. మరోవైపు ప్రజక్తా మేకప్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. ఒక రోజు ఆమె ఒక పెళ్లికి మేకప్ చేయడానికి వెళ్తుంది. అక్కడ పెళ్లికూతురు మాధవి చాలా మోడరన్, ఇంగ్లీష్ లో మాట్లాడే అమ్మాయి. పెళ్లి రోజే పెళ్లి కొడుకు పారిపోతాడు. మాధవి ఫ్యామిలీ అవమానం భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. ప్రజక్తా ఆమెను ఆపి, నా హస్బెండ్ మంచోడు, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో అని సడన్‌గా ప్రపోజ్ చేస్తుంది. ఈ విషయం తెలిసి విశ్వాసరావ్ షాక్ అయినా ప్రజక్తా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో ఒప్పుకుంటాడు. ఇక నుంచి ఇంట్లో ఇద్దరు భార్యలు ఒకే హస్బెండ్‌ని షేర్ చేసుకోవడం ఫుల్ గందరగోళం మొదలవుతుంది.

Read Also : ప్రేమలో పడే చెవిటి పూజారి… హెయిర్ స్టైల్ తోనే నవ్వు తెప్పిస్తున్న హీరో… ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ

Advertisement

ప్రజక్తా ట్రెడిషనల్ స్టైల్, మాధవి మోడరన్ స్టైల్ తో విశ్వాసరావ్ కోసం ఎదురు చూస్తుంటారు. అతను రాత్రి ఎవరి గదికి వెళ్లాలో తెలీక
తికమక పడతాడు. ఇంతలో మూడవ అమ్మాయి పారి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇస్తుంది. ఆమె విశ్వాసరావ్‌తో కాలేజీ టైంలో లవ్‌లో ఉన్నానని, ఇప్పుడు తనని కూడా పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ముగ్గురు భార్యలు ఒకే ఇంట్లో ఉంటారు. ముగ్గురు భార్యలు ఒకరినొకరు పోటీ పడుతూ, రోజువారీ షెడ్యూల్ పెట్టుకుంటారు. ఒకరు రొమాన్స్ కావాలంటే మిగతా ఇద్దరు గెస్ట్ రూమ్‌లో పడుకోవాల్సి వస్తుంది. ఇంతలో విశ్వాసరావ్‌కి ముగ్గురు భార్యలని గ్రామంలో గాసిప్స్ స్టార్ట్ అవుతాయి. బంధువులు ఇంటికి వచ్చి గందరగోళం ఇంకాస్త పెంచుతారు. క్లైమాక్స్‌లో ముగ్గురు భార్యలు ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ విశ్వాసరావ్‌ని వదిలేసి వెళ్లిపోతామని బెదిరిస్తారు. విశ్వాసరావ్ ఏడుస్తూ నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను, దయచేసి ఉండండని రిక్వెస్ట్ చేస్తాడు. చివరికి ఈ క్లైమాక్స్ ఎలావుంటుందనే విషయం తెలుసుకోవాలనుకుంటే, ఈ మరాఠీ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×