E-Paper
Advertisement

Telugu Comedy Drama OTT : రెండు వారాల క్రితం రిలీజ్… ఇప్పుడు ఆ భాషలల్లో కూడా అందుబాటులోకి తెలుగు కామెడీ డ్రామా

Telugu Comedy Drama OTT : రెండు వారాల క్రితం రిలీజ్… ఇప్పుడు ఆ భాషలల్లో కూడా అందుబాటులోకి తెలుగు కామెడీ డ్రామా
Advertisement

Telugu Comedy Drama OTT : తెలుగు డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన సినిమా ‘గుర్రం పాపి రెడ్డి’. ఈ సినిమా థియేటర్లలో వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వచ్చింది. డిజిటల్ ఆడియన్స్ ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. అయితే ఇది రెండు వారాల నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు వేరే భాషలలో కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది ఈ సినిమా. దీంతో మరింత మంది ప్రేక్షకులకు ఈ సినిమా దగ్గర కానుంది. మరి ఇది ఏ భాషలలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ భాషలలో అంటే

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ‘గుర్రం పాపి రెడ్డి’ (Gurram paapi reddy). మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ కాసిరెడ్డి, బ్రహ్మానందం, యోగి బాబు, జాన్ విజయ్, జీవన్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ తెలుగు కామెడీ మూవీ 2025 డిసెంబర్ 19, థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ తెలుగు సినిమా రెండు వారాల క్రితం ZEE5లో డిజిటల్‌ స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇప్పుడు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈ చిత్రానికి సంగీతం కృష్ణ సౌరభ్ సూరంపల్లి అందించగా, వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ ఈ సినిమాను నిర్మించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గుర్రం పాపిరెడ్డి (నరేశ్‌ అగస్త్య) ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆర్థిక కష్టాలతో ఉంటాడు. దీంతో డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతాడు. ఓ బ్యాంక్‌ దోపిడీకి ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాదు. అంతటితో ఆగక, ఎర్రగడ్డ మెంటల్‌ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి మరో ప్లాన్ వేస్తాడు. దీంతో అతనికి చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అసలు పని మొదలు పెడతారు. దీని కోసం శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని బయటకు తీసుకొచ్చి, దాన్ని శ్రీనగర్‌లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు.

అయితే ఈ పనిని చాలా సీక్రెట్ గా చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ పనిలోకి మరో ముగ్గుర్ని దింపుతాడు పాపిరెడ్డి. చివరికి ఈ శవ ప్రయాణం ఎలా సాగింది ? ఆ శవాల్ని మార్చడం కోసం పాపిరెడ్డి, సౌదామిని గ్యాంగ్‌కు ఎలాంటి సమస్యలు వచ్చాయి ? అసలు శవాలు మారిస్తే వీళ్ళకు డబ్బు ఎలా వస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : అయ్యబాబోయ్… సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతాయా ? ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

Tags

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×