E-Paper
Advertisement

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్
Advertisement

Feel Good Family Drama: ప్రేమంటే నమ్మకం… కుటుంబమంటే అనుబంధం… కానీ మనసులో దాగున్న పాత జ్ఞాపకాలు మాత్రం జీవితాన్ని ఎటు తీసుకెళ్తాయో చెప్పలేం. ప్రేమను నమ్మని ఓ అమ్మాయి జీవితంలోకి ప్రేమనే ప్రాణంగా భావించే ఓ యువకుడు వస్తే ? అదే సమయంలో ఓ కఠినమైన మనిషిని ఓ కుటుంబం చూపించే స్వచ్ఛమైన ప్రేమ మార్చేస్తే ? ప్రేమ, కుటుంబ బంధాలు, చిన్ననాటి జ్ఞాపకాలను కలిపి హృదయాన్ని హత్తుకునేలా తెరకెక్కించిన సినిమా ‘జ్ఞాపకాలు’ (Gnapakalu). తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథలోకి వెళ్తే…

‘జ్ఞాపకాలు’ కథ నందిని అనే యువతి చుట్టూ తిరుగుతుంది. జీవితంలో కమిట్‌మెంట్ అంటేనే ఆమెకు ఒక రకమైన భయం. ప్రేమ విషయంలోనూ పూర్తిగా నమ్మకం ఏర్పడని పరిస్థితి. సంబంధాలు, బాధ్యతలు తన జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తాయో అన్న ఆందోళన ఆమెను వెంటాడుతుంటుంది. అలాంటి సమయంలో ప్రేమపై పూర్తి నమ్మకం ఉన్న ఓ యువకుడు నందిని జీవితంలోకి వస్తాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా తాను ప్రేమించిన వ్యక్తిని వదులుకోకూడదనే పట్టుదల అతనిది. నందిని మాత్రం తన భయాలు, అనుమానాలతో ఆ బంధాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది.

Advertisement

ఈ ఇద్దరి మధ్య ఏర్పడే భావోద్వేగ సంఘర్షణ కథలో కీలకంగా మారుతుంది. ఇదే సమయంలో మరో కుటుంబ కథ కూడా ఇందులో ముడిపడి ఉంటుంది. కఠినమైన మనస్తత్వం ఉన్న ఓ వ్యక్తిని ఆ కుటుంబంలోని స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మీయత ఎలా మార్చాయి ? అసలు అతని మనసు అంత కఠినంగా మారడానికి కారణమేంటి ? కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధం అతని జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ? అనే అంశాలను కథలో చూడవచ్చు.

చిన్ననాటి రోజులు, అప్పట్లో ఏర్పడిన అనుబంధాలు, జీవితాంతం మనసులో నిలిచిపోయే మధురమైన క్షణాలను గుర్తు చేస్తూ సినిమా సాగుతుంది. ప్రేమకథతో పాటు కుటుంబ బంధాల విలువను కూడా చూపించడంతో ‘జ్ఞాపకాలు’ పేరుకు తగ్గట్టుగానే ప్రేక్షకులను తమ గత జ్ఞాపకాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరి ఇంతకీ నందిని పెళ్ళికి ఒప్పుకుందా ? చివరికి వీరిద్దరి లవ్ స్టోరీకి ఎండ్ కార్డు ఎలా పడింది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో అచ్చ తెలుగులో…

Advertisement

‘జ్ఞాపకాలు’ ఈటీవీ విన్‌ లోని ‘కథా సుధ – సండే స్టోరీస్’ (Katha Sudha – Sunday Stories) ఆంథాలజీలో 73వ ఎపిసోడ్‌ గా 2026 సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘శతమానం భవతి’ వంటి చిత్రాల దర్శకుడు వేగేశ్న సతీష్ పర్యవేక్షణలో ఈ ఎమోషనల్ డ్రామా రూపొందింది. జైభారత్ రాజ్, జయశ్రీ, కవితా శ్రీరంగం, ప్రద్యుమ్న బిల్లూరి తదితరులు ఇందులో నటించారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి కూర్చొని చూసే ఫీల్ గుడ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి భాషా ఇబ్బంది లేకుండా ఈటీవీ విన్‌లో నేరుగా తెలుగు ఆడియోలోనే చూడొచ్చు.

Read Also: 3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

Tags

Related News

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ సామాన్యుడి పోరాటం… మనసును తాకే ఎమోషనల్ మాస్టర్‌పీస్

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్

అర్ధరాత్రి నిద్రలోనే దాడి చేసే ఆత్మలు… నిద్రపోవడానికి కూడా భయపడే హర్రర్ థ్రిల్లర్

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

Big Stories

Advertisement
×