E-Paper
Advertisement

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?
Advertisement

Team India Off To Pakistan: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దూరం పెర‌గ‌డానికి ముఖ్య కారణం పాకిస్తాన్ ఉగ్రవాదం అన్న సంగతి తెలిసిందే. శాంతియుతంగా ఉండే ఇండియాలో నిత్యం ఉగ్రదాడులకు పాల్పడుతూ పాకిస్తాన్ కుట్రలకు తెర లేపుతోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య క్రికెట్ లో ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు…ఇత‌ర‌ క్రీడా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పాకిస్తాన్ లో ఇండియన్స్ పర్యటించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే ఈ రూల్స్ విషయంలో తాజాగా మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్లు పాకిస్తాన్ దేశంలో పర్యటించేందుకు అనుమతించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జ‌రిగితే, పాకిస్తాన్ లో టీమిండియా క్రీడాకారులు ప‌ర్య‌టించే ఛాన్స్ ఉంటుంది.

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

2027లో పాకిస్తాన్ వేదికగా సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ ( South Asian Federation (SAF) Games) జరగనున్నాయి. అయితే ఈ క్రీడాల‌లో ఆడేందుకు భారత బృందం పాకిస్తాన్ కు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇది కన్ఫామ్ అయితే మాత్రం… పహల్గామ్ సంఘటన తర్వాత ఇండియాకు పాకిస్తాన్ లో తొలి పర్యటన కానుంది.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

క్రికెట్ హాకీ సహా మొత్తం 28 గేమ్స్ తో ఈ టోర్నమెంట్ జరగనుంది. 2006 నుంచి ఇండియా హాకీ జట్టు… 2008 నుంచి టీమిండియా పాకిస్తాన్ దేశంలో పర్యటించలేదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం పాకిస్థాన్ లో టీమిండియా పర్యటించనుంది అన్నమాట. ఇదే జరిగితే వ్యూయర్షిప్ ఓ రేంజ్ లో ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. మరి దీనిపై మోడీ ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.

సౌత్ ఏషియన్ గేమ్స్ షెడ్యూల్ ఇదే

Advertisement

2027 సౌత్ ఏషియన్ గేమ్స్ ( South Asian Federation (SAF) Games) ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ ఆటలకు పాకిస్తాన్ వేదిక కానుంది. 2004లో పాకిస్థాన్ లో ఇదే ఈవెంట్ జరిగింది. అంటే సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ కొనసాగుతోంది. 14వ సౌత్ ఏషియన్ గేమ్స్ 2027 ఏప్రిల్ మూడవ తేదీ ఏప్రిల్ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇస్లామాబాద్, లాహోర్ తో పాటు పెషావర్ నగరాలలో ఈ గేమ్స్ కొనసాగనున్నాయి. పాకిస్తాన్ ( Pakistan) నుంచి స‌రైన భ‌ద్ర‌త హామీ వ‌స్తే, భార‌త అథ్లెట్లు ( Indian athlets) వెళ్లేందుకు మోడీ స‌ర్కార్ ( Modi Govt) అనుమ‌తులు ఇవ్వ‌నుంది.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Related News

నా ముందు గిల్ క్రిస్ట్, హేడెన్, ఏబీ డివిలియర్స్ పిల్ల బ‌చ్చాగాళ్లు

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

నా బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చి, గంగూలీ టార్చ‌ర్ చేశాడు

పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌కలం…రిజ్వాన్‌, ఇమామ్ ల‌పై బ్యాన్ ?

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేటర్‌పై నడుస్తోంది..ఏ క్ష‌ణ‌మైనా ఊపిరిపోతుంది

పాకిస్తాన్ హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్‌…? ఇక టీమిండియా జ‌ట్టుకు న‌ర‌క‌మేనా !

పాకిస్తాన్ తో టీమిండియాకు బ‌ల‌వంతంగా పెట్టొద్దు…గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Big Stories

Advertisement
×