E-Paper
Advertisement

The Art of Sarah on OTT : రిచ్ వరల్డ్ లోకి ఫేక్ అమ్మాయి… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్… ఇంటెన్స్ సస్పెన్స్

The Art of Sarah on OTT : రిచ్ వరల్డ్ లోకి ఫేక్ అమ్మాయి… కట్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్… ఇంటెన్స్ సస్పెన్స్
Advertisement

The Art of Sarah on OTT : ఓటిటిలో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నది మాత్రం కే డ్రామాలకే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కొరియన్ డ్రామాలు అంటే చెవి కోసుకునే వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. అందుకు కారణం ఈ సిరీస్ లలో ఉండే ఇంటెన్స్ క్యూరియాసిటీ, అలాగే ఊహించని ట్విస్టులు కూడా. తాజాగా మరో కొరియన్ డ్రామా ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఆ కొత్త సిరీస్ ఏంటి ? దాన్ని ఎక్కడ చూడొచ్చు? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

2026 లో రిలీజ్ అయిన తాజా కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది ఆర్ట్ ఆఫ్ సారా’ (The Art of Sarah series). ఫిబ్రవరి 13న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ప్రీమియర్ అయింది. మొత్తం 8 ఎపిసోడ్లతో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ 50 నుంచి 60 నిమిషాల నిడివితో ఉంటుంది. ఐఎండిబిలో ఈ సిరీస్ కి 8.2 రేటింగ్ ఉంది. సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిగా, అన్ని ఎపిసోడ్‌లు ఫిబ్రవరి 13నే విడుదల అయ్యాయి.

Advertisement

ఎపిసోడ్ 1: జేన్ డో (Jane Doe) – సారా కిమ్ మిస్టీరియస్ ఎంట్రీ – మర్డర్ మిస్టరీ పరిచయం.
ఎపిసోడ్ 2: సారా కిమ్ (Sara Kim) – సారా ఫేక్ ఐడెంటిటీ, ఎలైట్ సర్కిల్స్‌లోకి ప్రవేశం.
ఎపిసోడ్ 3: మోక్ గా-హుయ్ (Mock Ga-hui) – సారా మరో ముఖం, మొదటి మోసం బయటపడటం.
ఎపిసోడ్ 4: కిమ్ యున్-జే (Kim Yun-jae) – డిటెక్టివ్ పార్క్ దర్యాప్తు మొదలు – సారా దాచిన గతం.
ఎపిసోడ్ 5: బౌడోయిర్ (Boudoir) – ఇంటిమేట్ సీన్స్ – సారా సీక్రెట్ రిలేషన్‌షిప్ రివెలేషన్.
ఎపిసోడ్ 6: అన్‌రిజిస్టర్డ్ పర్సన్ (Unregistered Person) – సారా గుర్తింపు బట్టబయలు – హత్య కేసు ట్విస్ట్.
ఎపిసోడ్ 7: కిమ్ మి-జియోంగ్ (Kim Mi-jiyoung) – మల్టిపుల్ ఐడెంటిటీస్ బయటపడటం – డిటెక్టివ్‌తో కాన్ఫ్రంటేషన్.
ఎపిసోడ్ 8: ది ఆర్ట్ ఆఫ్ సారా (The Art of Sara) – క్లైమాక్స్, సారా క్రూర ఆశయాలు, ఎండింగ్ ట్విస్ట్.

Also Read : క్రైమ్ నుంచి సైన్స్ ఫిక్షన్‌ సినిమాల వరకు… నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న టాప్ వెబ్ సిరీస్‌ల లిస్ట్

Advertisement

 

కథలోకి వెళ్తే…

మిస్టీరియస్ కొరియన్ అమెరికన్ మహిళ సారా కిమ్. సిరీస్ మొత్తం ఈ అమ్మాయి చుట్టే తిరుగుతుంది. సీయోల్ లోని ఎలైట్ సర్కిల్లో ఆమె ఒక రిచ్ అమ్మాయి అన్నట్టుగా పేరు సంపాదించుకుంటుంది. ఇట్టే ఆకట్టుకునే అందం, బ్రిలియంట్, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా అందరికీ పరిచయం అవుతుంది. లగ్జరీ లైఫ్ స్టైల్, ఫ్యాషన్, సోషల్ నెట్వర్క్ తో ప్రపంచాన్ని మోసం చేస్తుంది. కానీ ఆమె చేసిన ఒక ఘోరమైన తప్పు వల్ల ఒక హత్య కేసులో చిక్కుకుంటుంది. డిటెక్టివ్ పార్క్ చాలా షార్ప్ గా ఉంటాడు. ఈ కేసులో అతను హీరోయిన్ ను సస్పెక్ట్ గా చూస్తాడు. అందుకే ఇదే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. దీంతో సారా బండారం మొత్తం బయటపడుతుంది. అసలు ఆమె ఈ ఎలైట్ క్లబ్లో ఎలా జాయిన్ అయింది ? డిటెక్టివ్ బయట పెట్టిన ఆమె లైఫ్ లోని సీక్రెట్ ఏంటి ? హీరోయిన్ ఇలా అందరినీ ఎందుకు మోసం చేస్తోంది ? అనేది ఈ సిరీస్ కథ.

 

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×