BigTV English
Advertisement

OTT Movie : పెళ్ళైన వాడితో పాల గ్లాసు యవ్వారం… హెబ్బా పటేల్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్

OTT Movie : పెళ్ళైన వాడితో పాల గ్లాసు యవ్వారం… హెబ్బా పటేల్ లేటెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్

OTT Movie : ఒక వైపు లవ్ స్టోరీ, మరో వైపు థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘థాంక్యూ డియర్’. ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా, ఐయండిబిలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. దీనికి రేటింగ్ ఏకంగా 9.3 /10 ఉంది. ఇందులో ఫిలిం ఇండస్ట్రీ లో పైకి రావాలనుకునే ఒక జంట, సైకో కిల్లర్ ట్రాప్ లో ఇరుక్కుంటారు. ఈ సినిమాలో ట్విస్ట్లు ఎలా ఉంటాయో రేటింగ్ చూస్తేనే తెలుస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘థాంక్యూ డియర్’  (Thank You Dear)మహాలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తోట శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, బలగం సుజాత వంటి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి పి.ఎల్.కె రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. 2025 ఆగష్టు 1న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే

సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యంతో సత్యం(ధనుష్ రఘుముద్రి) అనే యువకుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలు అలా సాగుతున్న సమయంలో ఓ రోజు ప్రియ(హెబ్బా పటేల్) అనే అమ్మాయిని చూస్తాడు. ఇక ఆగలేక ఆమెకు తన మనసులో మాటను చెప్పేస్తాడు. ఇలా కొద్ది రోజుల్లోనే వీళ్ళ పరిచయం ప్రేమ వరకు వెళ్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోతారు. ప్రియ కూడా నటి కావాలని అనుకుంటుంది. ఇక వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. వీళ్ళ లైఫ్ ఆనందంగా గడచిపోతుంటుంది. వీళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు.


Read Also : అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వెర్రివేశాలేసే సైకో .. రాత్రయితే ఫ్యామిలీ అంటూ నరకం… ఆ పాడు పనులన్నీ ఒకే గదిలో

ఈ సమయంలో సిటీలో వరుస హత్యలు కూడా జరుగుతుంటాయి. ఈ హత్యలకు కారణం ఒక అమ్మాయి అని తెలుస్తుంది. పోలీసులు ఈ కిల్లర్ కోసం జల్లెడ పడతారు. ఈ హత్యలు, ఈ జంట జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఉహించని ట్విస్టులు, అదిరిపోయే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా నడుస్తుంది. అసలు కిల్లర్ క్లైమాక్స్ లో రివీల్ అవుతాడు. ఇంతకీ వరుస హత్యలు చేస్తున్నది ఎవరు ? ఆ ఎందుకు చేస్తున్నారు ? సత్యం, ప్రియ ఇందులో ఎలా ఇరుక్కుంటారు ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Dude OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : మర్డర్ మిస్టరీ నుంచి సూపర్ హీరో దాకా… ఈ వారం ఒక్కో ఓటీటీలో ఒక్కో జానర్లో మోస్ట్ అవైటెడ్ తమిళ థ్రిల్లర్లు

OTT Movie : ఐఎండీబీలో 5.9 రేటింగే… కలెక్షన్లు మాత్రం 7000 కోట్లు… థియేటర్లలో దుమ్మురేపిన హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి

OTT Movie : ఒంటరి పిల్ల ఒంటిపై చెయ్యేసి పాడు పని… ట్విస్టులతో మతిపోగొట్టే మలయాళ మూవీ

OTT Movie : పొలిటీషియన్ కూతురి మర్డర్ కు స్కెచ్… క్రైమ్ – కామెడీ కలగలిసిన ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్

Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Big Stories

×