Suriya: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కమర్షియల్ డైరెక్టర్స్ లో పరుశురాం ఒకరు. యువత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు పరశురాం. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత పరశురాం దర్శకత్వం వహించిన సోలో సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయింది అంటే చాలామంది అప్పటినుంచి పరశురాం వర్క్ ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి రచయిత మరియు దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు ఆ సినిమాతో. ఇక విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియనిది కాదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక్కడితో పరుశురాం కాస్త స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
ఇక పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు లోని మిస్సయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని ఈ సినిమాతో మరోసారి బయటకు తీసాడు పరుశురాం. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంతేకాకుండా మహేష్ బాబు అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఈ సినిమాల్లో ప్రెసెంట్ చేశాడు.
ఇకపోతే తాజాగా సూర్య దర్శకుడు పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రెండోసారి తెలుగు దర్శుకుడి తో సినిమా చేయడానికి సిద్ధం. మొదట పరశురాం కథను కార్తీక్ చెప్పాడు. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఓకే అవలేదు. అందుకే సూర్య ఆప్షన్.
సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా సినిమా మొదలవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా అలానే ఆగిపోయింది. ఈ విషయంపై నాగచైతన్య కూడా స్పందిస్తూ ఆయన నా టైం వేస్ట్ చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పరశురాం నుంచి చివరగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక సూర్యతో చేయబోయే సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో వేచి చూడాలి.
Also Read: SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?