E-Paper
Advertisement

Shoaib Akhtar: టీమిండియా ప్లేయ‌ర్ల చెంప ప‌గిలింది..నెత్తిమీది క‌ళ్లు, నేల‌కు వ‌చ్చాయి !

Shoaib Akhtar: టీమిండియా ప్లేయ‌ర్ల చెంప ప‌గిలింది..నెత్తిమీది క‌ళ్లు, నేల‌కు వ‌చ్చాయి !
Advertisement

Shoaib Akhtar: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  సూపర్ 8 దశ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ 8 లో భాగంగా టీమిండియా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. ఆదివారం టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా అన్ని విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో టీమిండియా పైన ఏకంగా 76 పరుగులు తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా. ఇక టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చెంప పగిలేలా దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుందని బాంబు పేల్చారు. టీమిండియా కండ్లు నెత్తిమీద ఉన్నాయని.. దక్షిణాఫ్రికా దెబ్బకు నేలకు వచ్చాయని చురకలు కూడా అంటించారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

టీమిండియా ప్లేయ‌ర్ల చెంప ప‌గిలింది..నెత్తిమీది క‌ళ్లు, నేల‌కు వ‌చ్చాయి !

Advertisement

అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాను ( Narendra Modi Stadium, Ahmedabad) ఓడించడమే కాదు, టీమిండియా ప్లేయర్ల చెంప పగిలే ఆన్సర్ ఇచ్చారని దక్షిణాఫ్రికా జట్టును  (  South africa)   మెచ్చుకున్నారు షోయబ్ అక్తర్. 2024 T20 ప్రపంచ సమయంలో దక్షిణాఫ్రికా పైన టీమిండియా గెలిచిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే అప్పుడు తగిలిన దెబ్బకు ఇప్పుడు టీమిండియా పై దక్షిణాఫ్రికా పగ తీర్చుకుందని ( Revaege) వెల్లడించారు. టీమిండియా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో సూపర్ 8 లో దిగిందని, కానీ చిత్తుచిత్తుగా ఓడిపోవలసి వచ్చిందని పరువు తీశారు. ఈ ఓటమితో టీమిండియా ప్లేయర్లు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఫైర్ అయ్యారు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.

టీమిండియా చేసిన త‌ప్పిదాలు ఇవే

దక్షిణాఫ్రికా బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో టీమిండియా బౌలర్లు చాలా స్లోగా బౌలింగ్ చేశారని చురకలు అంటించారు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. కుల్దీప్ యాదవ్ లాంటి కీలక ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకుపోవడం కూడా చాలా తప్పిదమని విమర్శలు చేశారు షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar). బ్యాటింగ్ లోనూ టాపార్డ‌ర్ స‌రిగ్గా రాణించ‌లేద‌ని నిప్పులు చెరిగారు. వీట‌న్నిటిని అధిగ‌మిస్తేనే, టీమిండియా ( Team India) ముందుకు సాగుతుంద‌ని చుర‌క‌లు అంటించారు.

Advertisement

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !( Shoaib Akhtar)

 

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×