E-Paper
Advertisement

OTT Movie : సండే ఆఫీస్ పేరుతో బాస్ నిర్వాకం… భర్త దగ్గర ప్రైవేట్ వీడియో లీక్… హీరోయిన్ చేసే పనికి మైండ్ బ్లాక్

OTT Movie : సండే ఆఫీస్ పేరుతో బాస్ నిర్వాకం… భర్త దగ్గర ప్రైవేట్ వీడియో లీక్… హీరోయిన్ చేసే పనికి మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : భార్యాభర్తల మధ్య రహస్యాలు, భావోద్వేగ సంఘటనలతో ఒక షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికై, భారతదేశంలోని 14 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. గుండెను పిండే ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

Advertisement

‘దట్ సండే’ (That Sunday) 2015లో విడుదలైన హిందీ షార్ట్ ఫిల్మ్. ప్రభాకర్ మీనా భాస్కర్ పంత్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇందులో రోహిత్ పాఠక్, దీపేష్ షా, పాయల్ సింగ్, అమాన్ షా, అక్షత్ ప్రభాకర్ పంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. రోలర్ కోస్టర్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్, ఒక గృహిణి దాచిన రహస్యం చుట్టూ తిరిగే డ్రామా థ్రిల్లర్. IMDbలో దీనికి 5.8/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం youtube లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ కథ ఒక చిన్న కుటుంబం చుట్టూ జరుగుతుంది. రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఇతనికి సుమన్ అనే భార్య ఉంటుంది. వీళ్లకు ఒక కొడుకు కూడా ఉంటాడు. రవి అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉంటాడు. ఇంటి బాధ్యతలన్నీ భార్య సుమన్ చూసుకుంటుంది. ఒక సండే రోజున, వాళ్ల కొడుకు ఇంటిని శుభ్రం చేయమని రవిని కోరతాడు. ఇంటిని సర్దుతుండగా, రవి ఒక వెంట్ వెనుక దాచిన ఒక పాత వీడియో టేప్‌ను చూస్తాడు. ఆ టేప్‌ను ప్లే చేస్తే, ఒక షాకింగ్ రహస్యం బయటపడుతుంది. అది సుమన్‌ను ఆమె కొత్త బాస్ దారుణంగా అఘాయిత్యం చేసిన వీడియో! రవి ఈ దృశ్యాలను చూసి షాక్ అవుతాడు. అతని మనసులో వేల ప్రశ్నలు వస్తుంటాయి. సుమన్ ఈ రహస్యాన్ని ఎందుకు దాచింది? ఎందుకు పోలీసులకు చెప్పలేదు? అని బాధపడుతుంటాడు.

Read Also : చదువుకోవాల్సిన వయసులో ప్రేమ… పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

సుమన్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, రవి ఆమెను ఆ టేప్ గురించి నిలదీస్తాడు. ఇక్కడ కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ వీడియో నిజం కాదు. అది సుమన్ ప్లాన్ చేసిన ఒక నాటకం! సుమన్ తన భర్త జబ్బు తన బిడ్డకు వస్తుందని భయపడి. ఈ ఫేక్ సీన్‌ను సృష్టించి, ఆ బాస్‌తో ఒక డీల్ చేస్తుంది. తన బిడ్డకు ఆ జబ్బు రాకుండా ఉండటానికే అలా చేస్తుంది. ఈ రహస్యం బయటపడినప్పుడు, రవి, సుమన్ కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమన్ తన కుటుంబం కోసం చేసిన త్యాగం, రవి బాధ, వాళ్ల ప్రేమ కథ గుండెను పిండేలా చూపిస్తుంది. కానీ ఈ రహస్యం వాళ్ల కుటుంబాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. రవికి వచ్చిన జబ్బు ఏమిటి ? సుమన్ ఆ వీడియోని ఎందుకు తీసుకుంది ? ఆ వీడియో వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చుడండి.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×