Gundeninda gudigantalu Shruthi : బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని డైలీ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ మంచి డిమాండ్ ని సొంతం చేసుకున్నాయి. ఈ ఛానల్ లో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు ఒకటి. మధ్యతరగతి కుటుంబం లో ఉన్న వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, డబ్బులకు ఇచ్చే విలువలు గురించి ఈ సీరియల్ లో వివరించారు. అందుకే దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన కోడలు శృతిని వాళ్ల అత్త నెత్తిన పెట్టుకుంది. ఆ కోడలు కోసం ఏదైన చేస్తుంది. ఆ కోడలు పాత్రలో నటించిన శృతి రియల్ లైఫ్? సినిమాల గురించి ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం..
శృతి సినిమాలు..
గుండెనిండా గుడిగంటలు శృతి అసలు పేరు విహారిక చౌదరి.. ఈ అమ్మడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సీరియల్స్ లో బిజీగా ఉన్న విహారిక చౌదరి..స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీఇచ్చేముందు కొన్ని సినిమాల్లో నటించింది, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. కొంతమందికి మాత్రమే తెలుసు. సినిమా ల్లో నటించింది కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ సీరియల్ బాగా పేరు తీసుకొచ్చింది. ఇక రొమాంటికి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ‘వారధి’ సినిమాలో భర్త-ప్రియుడి మధ్య ఇబ్బందులు ఎదుర్కొనే రోల్ చేసింది విహారిక చౌదరి. గతేడాది వచ్చిన ‘కాలం రాసిన కథలు’, వి లవ్ బ్యాడ్ బాయ్స్ అనే మూవీస్ లో మెరిసింది. అలాగే ‘ఫంకీ ప్లాట్ మేట్స్’ అనే యూట్యూబ్ సిరీస్ లో నటించింది. ఇవే కాదు. నేను నా రాక్షసి, మేడ్ ఫర్ ఈచదర్, బుల్ల బ్బాయ్ ఫ్రమ్ బుర్రలంక అనే వెబ్ సిరీస్ లోనూ విహారిక చౌదరి నటించింది. ఎవరెవరో, లవ్ జర్నీ సహా పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఎక్స్ పీరియన్స్ ఉంది… వీటితో పాటుగా బుల్లితెర పై పలు సీరియల్స్ లలో నటించింది.
Also Read :సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..
గుండెనిండా గుడిగంటలు రెమ్యూనరేషన్..
సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రస్తుతం స్టార్ మా లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇందులో నటిస్తున్న యాక్టర్స్ మంచి రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారు. ఈ సీరియల్ లో నటిస్తున్న శృతి బాగానే వసూల్ చేస్తుంది. ప్రతి రోజు 25 వేలు చార్జ్ చేస్తుందట. నెలలో 20 రోజులు షూటింగ్ ఉంటుందట. అంటే నెలకు ఈ సీరియల్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది. సీరియల్స్ మాత్రమే కాదు. అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ ఆక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతాయి.