OTT Movie : ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, డిఫరెంట్ స్టోరీలు ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇందులో పెద్ద వింత ఏముంది అంటారా! అయితే ఆమె ఎవరితోనూ ఫిజికల్ గా కలవకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ సినిమా ఈ విషయం మీదే నడుస్తుంది. చివరి వరకూ ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ5 లో స్ట్రీమింగ్
ఈ తమిళ ఫాంటసీ కామెడీ మూవీ పేరు ‘Oru Pakka Kathai’. తరణీధరన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో కళిదాస్ జయరామ్ (సరవణన్), మేఘా ఆకాష్ (మీరా) ప్రధాన పాత్రల్లో నటించారు. K.S. శ్రీనివాసన్ నిర్మించిన ఈ సినిమా, ZEE5లో 2020 డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 126 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.9/10, Rotten Tomatoesలో 60% రేటింగ్ ఉంది.
Read Also : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు
స్టోరీలోకి వెళితే
మీరా (మేఘా ఆకాష్), సరవణన్ (కళిదాస్ జయరామ్) కాలేజీలో ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే చెప్తారు. కానీ ఒక కండిషన్ పెడతారు. ఈ కండిషన్ లో భాగంగా సరవణన్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ సంపాదించాల్సి ఉంటుంది. ఈలోగానే ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. వీళ్ళు ఫిజికల్ గా మూవ్ అవ్వకుండానే, మీరా ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం తెలిసి ఈ రెండు ఫ్యామిలీలు గందరగోళంలో పడతాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, డాక్టర్స్ మీరా ప్రెగ్నెన్సీని పార్థనోజెనసిస్‌గా తెలుస్తారు. అంటే కన్యాత్వంతో, ఇంటర్‌కోర్స్ లేకుండా వచ్చిన గర్భంగా దీనిని చూస్తారు. ఈ “మిరాకిల్” మీరా జీవితాన్ని తలకిందులు చేస్తుంది.
మీరా కథ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఊరంతా “దేవుడి సంతానం” అని గాసిప్స్ స్టార్ట్ అవుతాయి. మీరా, సరవణన్‌లు ఈ సమస్యని డీల్ చేస్తూ, తమ ప్రేమను, ఫ్యామిలీ బంధాలను కాపాడుకోవడానికి పోరాడతారు. ఈ సినిమా మొదటి భాగంలో పేరెంట్స్ పడే ఇబ్బంది, గైనకాలజిస్ట్‌ల రియాక్షన్స్, సినిమాని ఫన్‌గా, ఇంట్రెస్టింగ్‌గా నడిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో స్టోరీ సీరియస్ గా మూవ్ అవుతుంది. సరవణన్ తన పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి, మీరాని పెళ్లాడతాడు. కానీ సొసైటీ ఒత్తిడి, మీడియా సర్కస్ వాళ్లని వదిలిపెట్టకుండా వెంటాడుతూ ఉంటుంది. చివరికి సరవణన్, మీరా లైఫ్ ఎలా వెళ్తుంది ? ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.