E-Paper
Advertisement

Honor Pad X8b: 10,100mAh బ్యాటరీ, 11 ఇంచ్ డిస్‌ప్లేతో బడ్జెట్ టాబ్లెట్.. ధర ఎంతంటే?

Honor Pad X8b: 10,100mAh బ్యాటరీ, 11 ఇంచ్ డిస్‌ప్లేతో బడ్జెట్ టాబ్లెట్.. ధర ఎంతంటే?
Advertisement

Honor Pad X8b| హానర్ కంపెనీ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన కొత్త టాబ్లెట్ హానర్ ప్యాడ్ X8bను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ బడ్జెట్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందిచారు. సన్నని మెటల్ బాడీ డిజైన్‌తో స్టైలిష్‌గా, మంచి డ్యూరబిలిటీతో ఉంది. టాబ్లెట్ మందం కేవలం 7.25mm మాత్రమే. స్టైల్, బలం రెండింటినీ బ్యాలెన్స్ చేశారు.

ధర, లభ్యత

హానర్ ప్యాడ్ X8bను సౌదీ అరేబియాలో SAR 649 (భారత కరెన్సీలో దాదాపు రూ.15,000)కి లాంచ్ చేశారు. స్పేస్ గ్రే రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. హానర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారతదేశంలో త్వరలో లాంచ్ అవుతుందని అంచనా.

పెద్ద 11 ఇంచ్ డిస్‌ప్లే

Advertisement

ఈ టాబ్లెట్‌లో 11 ఇంచ్ IPS LCD డిస్‌ప్లే ఉంది. రెజల్యూషన్ 1920 x 1200 పిక్సెల్స్. పిక్సెల్ డెన్సిటీ 207 PPI. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. TUV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉంది. ఎక్కువ సమయం ఉపయోగించినా కళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. బరువు 496 గ్రాములు మాత్రమే. పెద్ద బ్యాటరీ ఉన్నా లైట్‌గా ఉంటుంది. సన్నని డిజైన్ వల్ల తీసుకెళ్లడం సులభం. మెటల్ బాడీ ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

పర్‌ఫామెన్స్, హార్డ్‌వేర్

స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో నడుస్తుంది. రోజువారీ పనులు, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా జరుగుతాయి. 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. యాప్‌లు, ఫైల్స్, మీడియా కోసం చాలా స్పేస్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో, మ్యాజిక్‌OS 10 ఇంటర్‌ఫేస్ ఉంది. సాఫ్ట్‌వేర్ క్లీన్‌గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

కెమెరా ఫీచర్లు

Advertisement

వెనుక వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆటోఫోకస్ సపోర్ట్ ఉంది. డాక్యుమెంట్లు, సాధారణ ఫోటోలు తీయడానికి బాగుంటుంది. ముందు వైపు కూడా 5MP కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరిపోతుంది. ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్‌లకు ఉపయోగపడుతుంది.

Also Read: రూ.10 లక్షల స్టూడియోకి నిప్పంటించిన యుట్యూబర్.. సబ్‌స్క్రైబర్స్ పెరగడంలేదని కోపం.. కానీ

పెద్ద బ్యాటరీ, ఆడియో

అతి పెద్ద హైలైట్ 10,100mAh బ్యాటరీ. ఎక్కువ గంటల పాటు స్ట్రీమింగ్, బ్రౌజింగ్, స్టడీ చేయవచ్చు. తరచూ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంది. నాలుగు స్పీకర్లు క్లియర్, లౌడ్ ఆడియో ఇస్తాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ చాలా మెరుగవుతుంది.

హానర్ ప్యాడ్ X8b ధర, ప్రాక్టికాలిటీపై దృష్టి పెట్టింది. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే కలిపి ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 680 స్థిరమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. సన్నని మెటల్ డిజైన్ డ్యూరబిలిటీ, స్టైల్ రెండూ ఇస్తుంది. విద్యార్థులు, క్యాజువల్ యూజర్లకు బాగా సరిపోతుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో గొప్ప వాల్యూ ఇస్తుంది.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×