BigTV English

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : కొరియన్ సినిమాలను మన వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు ఈ సినిమాల గురించి అంతగా పట్టించుకోని వాళ్ళు కూడా, టీవీకి అతుక్కుపోయి ఎంటర్టైన్ అవుతున్నారు. వీటిలో థ్రిల్లర్, రొమాంటిక్ జానర్లను ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ కథ ఒక బాక్సర్ చుట్టూ తిరుగుతుంది. తల్లికి బాగోలేక, తండ్రి ఎక్కడున్నాడో తెలీక ఇతను కష్టాల్లో ఉంటే, ఒక మాఫియా ఇతని వెంట పడుతుంది. ఈ క్రమంలో స్టోరీ సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘The Childe’ పార్క్ హూన్-జంగ్ డైరెక్ట్ చేసిన సౌత్ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ బ్యానర్‌లో రిలీజ్ అయింది. ఇందులో కిమ్ సియోన్-హో (నోబుల్‌మ్యాన్‌గా), కాంగ్ తాయ్-జూ (మార్కో హాన్‌గా), కిమ్ కాంగ్-వూ (హాన్ యి-సాగా), గో ఆరా (యూన్ జూగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూన్ 21న సౌత్ కొరియాలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, హులు, వీకీ, టూబీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ మార్కో హాన్ అనే ఒక కొరియన్ బాక్సర్ చుట్టూ తిరుగుతుంది. ఇతను ఫిలిప్పీన్స్‌లో ఇల్లీగల్ ఫైట్స్‌లో పాల్గొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి సర్జరీ కోసం డబ్బు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఈ మూమెంట్ లోనే మార్కో తన కొరియన్ తండ్రిని వెతకడానికి సౌత్ కొరియాకు వెళ్తాడు. కానీ అక్కడికి చేరిన వెంటనే, నోబుల్‌మన్ అనే కిరాయి హంతకుడు అతన్ని వెంబడించడం మొదలెడతాడు. ఈ సైకోటిక్ హంతకుడు, తన నవ్వుతూ మనుషుల్ని చంపుతుంటాడు. ఇప్పుడు మార్కో జీవితాన్ని టార్గెట్ చేస్తాడు.


మార్కో తన తండ్రిని కనిపెట్టే ప్రయత్నంలో, నోబుల్‌మన్‌తో సహా రకరకాల గ్యాంగ్‌స్టర్స్‌తో చిక్కుల్లో పడతాడు. ఇది కార్ చేజ్‌లు, బుల్లెట్ ఫైరింగ్‌లు, బ్లడ్‌షెడ్‌తో ఒక వైల్డ్ రైడ్‌గా మారుతుంది. ఈ కథ నడుస్తుండగా మార్కో తన తండ్రి గురించి ఒక షాకింగ్ సీక్రెట్ ని తెలుసుకుంటాడు. ఇది అతని జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. చివరికి నోబుల్‌మన్, మార్కో మధ్య జరిగే క్లైమాక్స్ ఫైట్ సీన్స్, సినిమాను ఒక థ్రిల్లింగ్ ఫినిష్‌కి తీసుకెళ్తాయి. చివరికి మార్కో తన తండ్రిని కనిపెడతాడా ? కొరియాలో మార్కోని, గ్యాంగ్ స్టర్స్ ఎందుకు వెంబడిస్తున్నారు ? మార్కో తన తల్లిని కాపాడుకుంటాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

Related News

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

×