OTT Movie : క్రైమ్, మిస్టరీ, మైథాలజీ ఎలిమెంట్స్‌తో ఒక తెలుగు సినిమా మైండ్ ని బెండ్ చేస్తోంది. ఈ కథ ఆంధ్ర-కర్ణాటక బోర్డర్‌లో 18 ఏళ్లుగా జరుగుతున్న మహిళల సీరియల్ కిల్లింగ్స్, బ్లాక్ మ్యాజిక్ రిచ్యువల్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక డిటెక్టివ్ ఈ మిస్టరీని సాల్వ్ చేసే ఈ జర్నీ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’ అనేది తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా. పురుషోత్తం రాజ్, శ్రవణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను, విజయ సారగ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముదిమ్బి నిర్మించారు. ఇందులో శివ కందుకూరి (భాస్కర్ నారాయణగా), రాశి సింగ్ (లక్ష్మిగా), వర్షిణి సౌందరరాజన్ (రుద్రవేణిగా), శివకుమార్ రామచంద్రవరపు (ఇంద్రజిత్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. దేవీ ప్రసాద్ (CI దానవ శంకరాచార్యులు), అరుణ్ కుమార్ (డిటెక్టివ్ ప్రసాద్), శివన్నారాయణ నరిపెద్ది (గంగాధర రావు) సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా 2024 మార్చి 1న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 2024 మార్చి 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.
ఈ కథ ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ గత 18 సంవత్సరాలుగా 17 విషాదకరమైన హత్యలు పరిష్కారం కాకుండా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ హత్యలు సామాన్యమైనవి కావు. ఎందుకంటే హంతకుడు బాధితుల తలలను తీసుకుని, దిష్టి బొమ్మను సంఘటనా స్థలంలో వదిలి వెళ్తుంటాడు. ఆశ్చర్యకరంగా ఎవరూ మిస్సింగ్ కేసులు నమోదు చేయరు. ఈ కథలో ప్రధాన పాత్ర భాస్కర్ నారాయణ (శివ కందుకూరి), ఒక చిన్నస్థాయి డిటెక్టివ్, ఈ హత్యల కేసును తీసుకుంటాడు. భాస్కర్ ని అతని కుటుంబం కూడా పెద్దగా పట్టించుకోదు. ప్రేమలో కూడా అతనికి ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ కేసు అతని వ్యక్తిగత జీవితంతో ఊహించని సంబంధాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. ఈ కేసును పరిష్కరించడానికి అతను లక్ష్మి అనే ఒక రిపోర్టర్, డిటెక్టివ్ ప్రసాద్ సహాయంతో ముందుకు సాగుతాడు.
ఇప్పుడు భాస్కర్ నారాయణ తన దర్యాప్తును ప్రారంభిస్తాడు. కానీ ఈ హత్యల వెనుక ఒక సీక్రెట్ ఉందని తెలుస్తుంది. ఇవి చేతబడి, మాంత్రిక తంత్రాలతో సంబంధం కలిగిన నరబలి హత్యలుగా గుర్తిస్తారు. ఈ కథ నడుస్తుండగా ఒక మిథోలాజికల్ ట్విస్ట్ చేస్తుంది. ఈ హత్యలు ఒక పురాణ కథతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది కథను మరింత ఇంటెన్స్ గా చేస్తుంది. భాస్కర్, లక్ష్మి, ప్రసాద్ కలిసి ఈ రహస్యాన్ని విప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ తలలు తీసుకోబడిన బాధితుల గురించి సమాచారం లేకపోవడం వల్ల ఈ దర్యాప్తును కష్టతరం అవుతుంది. ఈ ప్రక్రియలో భాస్కర్ తన వ్యక్తిగత జీవితంతో ఈ కేసు ఎలా సంబంధం కలిగి ఉందో కనుగొంటాడు. ఇది దర్యాప్తుని మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ కథ చివరి 20 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతుంది. భాస్కర్ హంతకుడి గుర్తింపును, అతని ఉద్దేశాలను వెల్లడిస్తూ ఒక ముఖ్యమైన ట్విస్ట్‌ను బయటపెడతాడు. చివరికి భాస్కర్ ఈ సీరియల్ కిల్లర్‌ను పట్టుకుంటాడా ? ఈ కేసుకు న్యాయం చేస్తాడా ?కిల్లర్ ఎవరు ? ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్