BigTV English

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా, ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ కథ ఒక అనాథ గ్యాంగ్‌స్టర్‌గా మారి, ప్రేమలో పడి, ఆ తర్వాత జీవితంలో ట్రాజెడీ ఫేస్ చేయడం చుట్టూ తిరుగుతుంది. అంతేకాకుండా HIV మీద ఒక అవగాహనను కూడా ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘లవ్ లీ’ (Love li)  చేతన్ కేశవ్ డైరెక్ట్ చేసిన కన్నడ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. దీనిని అభువనాస క్రియేషన్స్ బ్యానర్‌లో రవీంద్ర కుమార్ నిర్మించారు. ఇందులో వశిష్ట ఎన్. సింహ (జైగా), స్టెఫీ పటేల్ (జననిగా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూన్ 14న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇది 2024 ఆగస్టు 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.5/10 రేటింగ్ ని పొందింది.

కథలోకి వెళ్తే

జై అనే అనాథ, చిన్నప్పటి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. జనని అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ తన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల మొదట ఆమెను అక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోడు. జనని పట్టు విడవకుండా జైని ఒప్పిస్తుంది. వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటారు. జనని తల్లిదండ్రులు ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో, వాళ్లు మంగళూరు వెళ్లి సెటిల్ అవుతారు. జై తన గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ని వదిలేసి, ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో జాబ్ చేస్తూ, జననితో, వాళ్ల చిన్న కూతురు తనుతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ సంతోషకరమైన జీవితం, ఒక ఊహించని ట్విస్ట్‌తో ఛిన్నాభిన్నం అవుతుంది.


జై, జనని జీవితం హ్యాపీగా సాగుతుండగా, జననికి HIV వైరస్ సోకినట్లు తెలుస్తుంది. ఇది క్రిముహి అనే సైకోపాత్ చేసిన పనిగా జై తెలుసుకుంటాడు. ఈ విషాదం జైని తిరిగి తన గ్యాంగ్‌స్టర్ అవతారంలోకి తీసుకెళ్తుంది. జననిని కాపాడేందుకు లండన్‌లో ట్రీట్‌మెంట్ ఏర్పాటు చేస్తూనే, క్రిముహిని వెతకడం మొదలెడతాడు. జై క్రిముహిని ట్రాక్ చేసి, ఒక బ్రూటల్ ఫైట్‌లో అతన్ని ఖతం చేస్తాడు. ఇక జనని ఆరోగ్యం కోసం విశ్వ ప్రయత్నం చేస్తాడు. చివరికి జనని వైరస్ నుండి కోలుకుంటుందా ? జై తన కుటుంబంతో తిరిగి సంతోషంగా ఉంటాడా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Related News

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

×