OTT Movie : రొమాంటిక్ మూవీ లవర్స్ ని అలరించే సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. వీటిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమా తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ లో నటించి, మెప్పించింది. ఈ కథ భర్త శాడిజం తట్టుకోలేక, మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకునే ఒక మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘తీరా కాదల్’ (Theera Kaadhal) రోహిన్ వెంకటేశన్ దర్శకతత్వం వహించిన తమిళ రొమాంటిక్ సినిమా. దీనిని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుబాష్కరన్ నిర్మించారు. ఈ సినిమా 2023 మే 26న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 2023 జూన్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జై (గౌతమ్‌గా), ఐశ్వర్య రాజేష్ (ఆరన్యగా), శివద (వందనగా), అమ్జత్ ఖాన్ (ప్రకాష్‌గా), వృద్ధి విశాల్ (ఆర్తిగా) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
గౌతమ్ అనే వ్యక్తి చెన్నైలో తన భార్య వందన, కూతురు ఆర్తితో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ వందన ఉద్యోగ రీత్యా బిజిగా ఉండటంతో ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైమ్ తక్కువగా ఉంటుంది. గౌతమ్ ఒక రోజు బిజినెస్ ట్రిప్ కోసం మంగళూరు వెళ్తాడు, అక్కడ అనుకోకుండా తన కాలేజీ ఎక్స్-లవర్ ఆరన్యను కలుస్తాడు. ఆరన్య తన హస్బెండ్ ప్రకాష్ తో, ఒక అబ్యూసివ్ మ్యారేజ్‌లో ఉంటుంది. అతను ఆమెను కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. ఒక సీన్‌లో ఆరన్య ట్రాఫిక్‌లో ప్రకాష్‌తో గోడవపడుతుంది. అతను ఆమెను అక్కడే కొడతాడు. ఇది వీళ్ళ మధ్య ఇంకా గ్యాప్ పెంచుతుంది. ఈ సమయంలో గౌతమ్, ఆరన్య మంగళూరులో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. డిన్నర్స్, ఫేవరెట్ ఫుడ్ గుర్తుంచుకోవడం, బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు లాంటి సీన్స్‌తో వాళ్ల ఓల్డ్ లవ్ మళ్ళీ చిగురిస్తుంది.
ఆరన్య గౌతమ్ దగ్గరకు మళ్లీ వస్తుంది. అతని ఫ్లాట్ పక్కనే అద్దెకు దిగుతుంది. అతని ఫ్యామిలీతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. గౌతమ్ కూడా ఆమెకు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడు. కానీ ఆమె అతనితో రొమాంటిక్‌గా కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. ఇది గౌతమ్‌ని టెన్షన్‌లో పడేస్తుంది. వందనకి గౌతమ్, ఆరన్య కాలేజీ లవ్ గురించి తెలుస్తుంది. ఆమె అనుమానంతో మరో సిమ్ కార్డ్‌తో గౌతమ్‌ని టెస్ట్ చేస్తుంది. ఆరన్యని గౌతమ్ దూరం పెట్టడంతో సూసైడ్ ట్రై చేస్తుంది. మళ్ళీ గౌతమ్ ఆమెను సేవ్ చేస్తాడు. కానీ వందన దీన్ని చూసి గౌతమ్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుని, తన అమ్మ ఇంటికి వెళ్లిపోతుంది. క్లైమాక్స్ వహించని ట్విస్ట్ తో ముగుస్తుంది. చివరికి గౌతమ్ వందనతో లైఫ్ ని లీడ్ చేస్తాడా ? ఆరన్యతో కలసి ఉంటాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్