BigTV English

OTT Movie : పెట్రోల్ తాగకపోతే చచ్చే హీరో… బుర్ర కరాబ్ అయ్యే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : పెట్రోల్ తాగకపోతే చచ్చే హీరో… బుర్ర కరాబ్ అయ్యే ట్విస్టులున్న కొరియన్ థ్రిల్లర్

OTT Movie : కొరియన్ సినిమాలను, సిరీస్ లను ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియెన్ సినిమా సైన్స్-ఫిక్షన్ జానర్ లో తెరకెక్కింది. ఇందులో ట్విస్ట్లు , కడుపుబ్బా నవ్వించే సీన్లు ఉన్నాయి. ఒక ఏలియన్ పెళ్ళి చేసుకున్నాక అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సైన్స్-ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘నైట్ ఆఫ్ ది ఆన్డీడ్’  (Night of the Undead). 2020 లో వచ్చిన ఈ కొరియన్ మూవీకి షిన్ జియోంగ్-వోన్ దర్శకత్వం వహించారు. ఇందులో లీ జంగ్-హ్యున్, కిమ్ సంగ్-ఓహ్, సియో యంగ్-హీ, యాంగ్ డాంగ్-గన్, లీ మి-డో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఒక విచిత్రమైన ఏలియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. IMDb లో దీనికి 5.4/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

సో-హీ అనే అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళి జరుగుతుంది. ఆమె భర్త మాన్-గిల్ తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. మాన్-గిల్ ఆదర్శవంతమైన భర్తగా కనిపిస్తాడు. కేవలం మూడు గంటల నిద్రతోనే రోజంతా చురుకుగా ఉంటాడు. అయితే అతని అతి-పర్ఫెక్ట్ స్వభావం సో-హీకి అనుమానాన్ని కలిగిస్తుంది. అతను తరచూ ఆలస్యంగా ఇంటికి వస్తాడు. కొన్ని సమయాల్లో మనిషిగా అనిపించడం లేదని ఆమె భావిస్తుంది.
సో-హీ తన అనుమానాలను తీర్చుకోవడానికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదిస్తుంది. దానిని జాంగ్ అనే వ్యక్తి నడుపుతుంటాడు. అతను ఏలియన్ గురించి చాలా సమాచారం తెలిసి ఉంటుంది. అతను చేసే దర్యాప్తులో మాన్-గిల్ ఒక సీరియల్ కిల్లర్ అని, గతంలో అతను వివాహం చేసుకున్న అనేక మహిళలు అదృశ్యమయ్యారని తెలుస్తుంది. అతను నిజానికి ఒక ఏలియన్, భూమిపై మానవులను అధ్యయనం చేస్తూ, వారిని చంపే ఉద్దేశంతో ఉన్నాడని తరువాత బయటపడుతుంది.

మాన్-గిల్ తాను ఎవరూ బయటపడినట్లు తెలుసుకుని, సో-హీని చంపడానికి ప్రయత్నిస్తాడు. సో-హీ తన పాత స్నేహితులు సెరా, యాంగ్-సన్ సహాయంతో, మాన్-గిల్‌ను అడ్డుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది. వీళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ మాన్-గిల్ ఒక చావులేని ఏలియన్ కావడంతో, అతన్ని చంపడం అంత సులభం కాదని తెలుస్తుంది. ఈ ప్రయత్నంలో వీళ్ళు అనేక విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కుంటారు. తాను ఆహారంగా పెట్రోల్ తాగుతుంటాడు. ఈ విషయం వీళ్ళను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చివరికి సో-హీని మాన్-గిల్ ఏం చేస్తాడు ? సో-హీ తన ఫ్రెండ్స్ తో కలసి మాన్-గిల్ ను చంపుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈసినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పేరెంట్స్ ను కాదని వేరొకరికి కూతురు దత్తత… పోలీస్ ఆఫీసర్ తో ఆటలా? హార్ట్ టచింగ్ మలయాళం మూవీ

Related News

OTT Movie : అమ్మాయిల్ని ఆ పని కోసమే పుట్టించే ఆణిముత్యం… లాభం లేదు ఒంటరిగా చూడాల్సిందే భయ్యా

OTT Movie : చంపి, శవాలపై U గుర్తు చెక్కే సీరియల్ కిల్లర్… ఒక్కో కేసులో ఒక్కో ట్విస్ట్… థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : మనిషి లోపల మకాం పెట్టే చిట్టి ఏలియన్స్… భూమిని తుడిచి పెట్టే ప్లాన్ తో రంగంలోకి.

OTT Movie: రేప్ కేసులో సీఎం, ప్రభుత్వాన్ని ఇరికించే లాయర్.. తప్పు బాధితురాలిదా? విడుదలైన గంటలోనే ఓటీటీలో సంచలనం

OTT Movie : చావు అంచులదాకా వెళ్లే హీరో… అపరిచితుల ఎంట్రీతో అల్టిమేట్ ట్విస్ట్… కడుపుబ్బా నవ్వించే మలయాళ కామెడీ

Sir Madam OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సార్ మేడమ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

×