OTT Movie : ఒక హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 1954లో అదరగిట్టింది. ఈ సినిమాను చూసి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ప్రసిద్ధ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డయల్ యమ్ ఫర్ మర్డర్’ (Dial M for Murder). 1954 లో వచ్చిన ఈ సినిమాకి ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెడరిక్ నాట్ రాసిన ఒక నాటకం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా స్టోరీఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈదులో గ్రేస్ కెల్లీ (మార్గో), రే మిల్లాండ్ (టోనీ), రాబర్ట్ కమ్మింగ్స్ (మార్క్), జాన్ విలియమ్స్ (ఇన్‌స్పెక్టర్ హబ్బర్డ్), ఆంథోనీ డాసన్ (స్వాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. IMDB లో ఈ సినిమాకి 8.2/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
టోనీ వెండిస్ ఒక రిటైర్డ్ టెన్నిస్ ప్లేయర్. అతను తన సంపన్నరాలైన భార్య మార్గోతో లండన్‌లో నివసిస్తుంటాడు. టోనీకి మార్గో సంపదపై ఆధారపడి జీవించడం ఇష్టం లేనప్పటికీ, అతను ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. అయితే మార్గోకు అమెరికన్ క్రైమ్ నవల రచయిత మార్క్ హాలిడేతో సంబంధం ఉందని టోనీకి తెలుస్తుంది. మార్గో తనని విడిచిపెట్టి, ఆస్తిని కూడా తీసుకెళ్తుందనే భయంతో, టోనీ ఆమెను చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఇలా చేస్తే ఆమె ఆస్తి తనకు దక్కుతుందని భావిస్తాడు. టోనీ తన పాత కాలేజీ స్నేహితుడు స్వాన్ ను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. అతను ఇప్పుడు చిన్న నేరస్థుడిగా మారాడు. టోనీ, స్వాన్‌ను మార్గోను చంపమని ఒప్పిస్తాడు. దానికి డబ్బులు కూడా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అతను ఒక ప్లాన్ కూడా చెప్తాడు. ఇక ఒకరోజు టోనీ ఒక క్లబ్‌కు వెళ్తాడు. అదే సమయంలో స్వాన్ ఇంట్లోకి చొరబడి, మార్గోను గొంతు నొక్కి చంపాలి. ఈ హత్య ఎవరో ఆగంతకుడి చేతిలో జరిగినట్లు కనిపించేలా ప్లాన్ రూపొందిస్తాడు టోనీ.
అయితే ప్లాన్ అనుకున్నట్లు జరగదు. స్వాన్ ఆమె గొంతు నొక్కబోతున్నప్పుడు, ఆమె అతనితో పోరాడి, దగ్గరలో ఉన్న కత్తెరతో స్వాన్‌ను పొడిచి చంపేస్తుంది. ఈ ఊహించని ట్విస్ట్‌తో టోనీ ప్లాన్ బెడిసికొడుతుంది. కానీ అతను తన భార్య హత్యకు దోషిగా నిందించబడేలా మరొక తెలివైన ప్లాన్ వేస్తాడు. అతను స్వాన్‌ను మార్గో బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు, ఆమె అతన్ని హత్య చేసినట్లు ఆధారాలను అమర్చుతాడు. మార్గోను హత్య ఆరోపణలపై అరెస్ట్ చేస్తారు. ఆమెకు మరణశిక్ష విధించబడుతుంది. అయితే మార్క్, పోలీసు ఇన్‌స్పెక్టర్ హబ్బర్డ్ ఈ కేసులో ఏదో తప్పు ఉందని సందేహిస్తారు. హబ్బర్డ్ తన దర్యాప్తు ద్వారా, టోనీ ప్లాన్‌లోని లొసుగులను కనిపెడతాడు. ఆతరువాత స్టోరీ మారిపోతుంది. చివరికి టోనీ ఈ కేసులో జైలుకు వెళ్తాడా ?మార్గో జైలునుంచి విడుదలవుతుందా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : కోటీశ్వరుడే కానీ సరదా కోసం ఇదేం పాడు పని ? ఎట్టకేలకు ఓటీటీలోకి క్రేజీ కన్నడ క్రైమ్ డ్రామా