E-Paper
Advertisement

Best Movie in Netflix : ప్రేమించిన అమ్మాయి ప్రైజ్ ను బజార్లో పెట్టే కిరాతకుడు… ఆమె చెప్పే గుణపాఠానికి బుర్ర బద్దలే

Best Movie in Netflix : ప్రేమించిన అమ్మాయి ప్రైజ్ ను బజార్లో పెట్టే కిరాతకుడు… ఆమె చెప్పే గుణపాఠానికి బుర్ర బద్దలే
Advertisement

Best Movie in Netflix : రష్మిక మందన్న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. టాక్సిక్ రిలేషన్‌షిప్, మానసిక వేధింపులను చాలా రియలిస్టిక్‌గా చూపించిన ఈ సినిమా, 2025లో తెలుగు సినిమాల్లో అతి పెద్ద సంచలనం అయింది. ఇది ‘అర్జున్ రెడ్డి రివర్స్ వర్షన్’ అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఒక డీసెంట్ అమ్మాయి ప్రేమికుడి వల్ల రెబెల్ గా మారుతుంది. ఈ సినిమాని యూత్ తెగ చూసేస్తునారు. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. ఈ సినిమా ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు. డిసెంబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాలో రష్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Read Also : దుబాయ్ లో దూకుడు పెంచే అమ్మాయిలు… 10 నిమిషాలకో హాట్ సీన్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

స్టోరీ ఏమిటంటే

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న భూమి (రష్మిక మందన్న) కాలేజ్‌లోనే అర్జున్ (ధీక్షిత్ షెట్టి)తో ప్రేమలో పడుతుంది. మొదటి రోజుల్లో ఫుల్ రొమాన్స్, లాంగ్ డ్రైవ్స్ తో సంతోషంగా అనిపిస్తుంది. అయితే కొన్ని నెలలకే అర్జున్ నిజస్వరూపం బయటపడుతుంది. జీలసీ, కంట్రోలింగ్, ఫోన్ చెక్ చేయడం వంటివి చేయడం మొదలు పెడతాడు. ఒక రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆమ్మని కూడా పరిచయం చేస్తాడు. అయితే ఆమె పరిస్థితి చూసి భూమి భయపడుతుంది. అర్జున్ తల్లిని ఆమె భర్త ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల ఆమె మానసికంగా కుంగిపోయి ఉంటుంది. ఆమెను చూసినప్పటినుంచి భూమిలో అనుమానం మొదలవుతుంది. తనని కూడా ఇలాగే ట్రీట్ చేస్తారని భయపడుతుంది.

Advertisement

ఇంతలో భూమి తండ్రికి విషయం తెలిసి నానా రచ్చ చేస్తాడు. అర్జున్ కూడా తనని కంట్రోల్ లో పెట్టాలని చూస్తుంటాడు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ తర్వాత భూమికి బెంగళూరులో జాబ్ ఆఫర్ వస్తే, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయిస్తాడు. దీంతో భూమి అర్జున్ కి బ్రేక్ అప్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాని అర్జున్ ఆమెను ఈ సారి నీ లైఫ్ నాశనం చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్లైమాక్స్ మాత్రం ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? అర్జున్ బ్లాక్ మెయిల్ ను భూమి ఎలా ఎదుర్కొంటుంది ? భూమి కొత్త జీవితం మొదలు పెడుతుందా ? ఆమెకు తండ్రి సపోర్ట్ చేస్తాడా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ డ్రామా సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×