E-Paper
Advertisement

ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న అదిరిపోయే సినిమాలు… యాక్షన్ థ్రిల్లర్ నుంచి హారర్ వరకు

ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న అదిరిపోయే సినిమాలు… యాక్షన్ థ్రిల్లర్ నుంచి హారర్ వరకు
Advertisement

New Hollywood Movies on OTT : 2026లో విడుదలైన కొన్ని మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టాయి. మరి అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

1. Lee Cronin’s The Mummy – Prime Video

దర్శకుడు లీ క్రోనిన్ డైరక్షన్ లో తెరకెక్కిన సరికొత్త సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘ది మమ్మీ. ఇది పాత మమ్మీ సినిమాల కంటే డిఫరెంట్ గా, అత్యంత భయంకరమైన డార్క్ థీమ్‌ తో రూపొందిన మూవీ ఇది. కానన్ అనే జర్నలిస్ట్ చిన్న కూతురు పేరు కేటీ. ఈజిప్ట్ ఎడారిలో ఆమె అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. 8 ఏళ్ల తర్వాత ఆమె ఒక 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో ప్రాణాలతో బయట పడుతుంది. అయితే చాలాకాలం క్రితమే తప్పిపోయిన కూతురును ఆ కుటుంబం ఆనందంతో ఇంటికి తెచ్చుకుంటుంది. కానీ అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు అవుతుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుండి తమను తాము ఎలా కాపాడుకున్నారనేదే మిగిలిన కథ.

2. The Super Mario Galaxy Movie – Prime Video

Advertisement

ఈ యానిమేషన్ మూవీ ఒక విజువల్ వండర్. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ మూవీని పిల్లలు అస్సలు మిస్ అవ్వొద్దు. మష్రూమ్ కింగ్‌డమ్‌లో ప్రశాంతంగా జీవిస్తారు మారియో, లుయిగి. అయిత అనుకోకుండా వాళ్ళకు విశ్వం నుండి ఒక ఊహించని ముప్పు మొదలవుతుంది. ఒక కాస్మిక్ ప్రమాదం వల్ల దేవుళ్లతో సహ అంతరిక్ష జీవులు ఇబ్బందుల్లో పడతారు. అలాగే కిడ్నాప్ అయిన రోసాలినాను కాపాడటానికి మారియో తన టీంతో కలిసి విశ్వాన్ని ఎలా రక్షించాడు ? అనేదే ఈ అడ్వెంచర్ మూవీ కథాంశం.

3. Maximum Pleasure Guaranteed – Apple TV+

ఈ చిత్రం ఒక మైండ్ బెండింగ్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. టాటియానా మస్లానీ, జేక్ జాన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పౌలా డివోర్స్డ్ మదర్. తన కొడుకు యూత్ సాకర్ మ్యాచ్ ఆడుతుండగా, అనుకోకుండా ఆమె భయంకరమైన నేరాన్ని చూస్తుంది. మొదట్లో భ్రమ అనుకుంటుంది. కానీ తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ కోసం రంగంలోకి దిగి, అది ఒక పెద్ద కుట్ర అని తెలుసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బ్లాక్‌మెయిల్, అదృశ్యమవుతున్న శవాలు, పొలిటికల్ స్కామ్స్ ఇలా అదిరిపోయే ట్విస్టులతో పెద్ద చక్రవ్యూహంలో చిక్కుకుంటుంది. ఈ ప్రమాదం నుండి తన కుటుంబాన్ని ఆమె ఎలా కాపాడుకుంది అనేది స్టోరీ.

4. Tom Clancy’s Jack Ryan: Ghost War – Prime Video

Advertisement

హై-స్టేక్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో జాన్ క్రాసిన్స్కి మళ్లీ ఐకానిక్ స్పై ‘జాక్ రయన్’ పాత్రలో మెరిశారు. సిఐఏ మాజీ ఏజెంట్ జాక్ రయన్ ఒక ప్రమాదం కారణంగా మళ్లీ రంగంలోకి దిగుతాడు. గతంలో క్లోజ్ చేసిన ‘స్టార్లింగ్’ (Starling) అనే ఒక అండర్ గ్రౌండ్ బ్లాక్-ఆప్స్ విభాగం మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. హీరో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. శత్రువులకు తమ ప్రతి కదలిక ముందే తెలిసిపోతున్న తరుణంలో, జాక్ ఈ అంతర్జాతీయ కుట్రను ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ.

Also Read : ద్వీపంలో చిక్కుకునే చిన్నపిల్లలు… చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడిచే ఉత్కంఠభరితమైన సిరీస్

5. The Boroughs – నెట్‌ఫ్లిక్స్ సిరీస్

రిటైర్మెంట్ కమ్యూనిటీ.. ఒకరకంగా చెప్పాలంటే వృద్ధాశ్రమంలో ఉండే కొంతమంది వృద్ధుల బృందం కథ ఈ సిరీస్. తమ పట్టణాన్ని నాశనం చేయడానికి వేరే లోకం నుండి ఊడిపడే అతీంద్రియ శక్తులు, దెయ్యాలను ఈ వృద్ధులు తమ తెలివితేటలతో ఎలా ఊడించారు అన్నదాన్ని ఈ వినూత్న సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ లో చూడవచ్చు.

Ladies First

వివిధ రంగాలలో మొట్టమొదటి సారిగా అడుగు పెట్టి రికార్డులు సృష్టించిన మహిళల విజయాలను ఇందులో చూడవచ్చు. వారి వ్యక్తిగత జీవితాల ఆధారంగా సాగే ఎమోషనల్ అంథాలజీ డ్రామా ఈ సిరీస్.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×