E-Paper
Advertisement

మార్షల్ ఆర్ట్స్ లో వీటిని తల దన్నే సినిమానే లేదు… డోంట్ మిస్

మార్షల్ ఆర్ట్స్ లో వీటిని తల దన్నే సినిమానే లేదు… డోంట్ మిస్
Advertisement

Best Martial Arts Movie on OTT : స్క్రీన్ మీద డిష్యూం డిష్యూం అంటూ ఎగిరెగిరి తంతే వచ్చే కిక్కే వేరు. అందులోనూ పక్కా మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు ఉంటే థియేటర్లో అయినా, ఇంట్లో టీవీలో అయినా కుర్చీలు విరిగిపోవాల్సిందే. ఇక్కడ చెప్పుకోబోయే ఐదు సినిమాలు చూస్తే మీలో నిద్రపోతున్న ఫైటర్ బయటకొచ్చి, ఇంట్లో సామాన్లు పగలగొట్టడం ఖాయం. అస్సలు మిస్ అవ్వకూడదనే రేంజ్ కల్ట్ క్లాసిక్స్ ఇవి. మరి లేట్ చేయకుండా ఆ నరాలు తెగే యాక్షన్ సినిమాలేంటో, అవి ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేద్దాం.

1. ఎంటర్ ది డ్రాగన్ (Enter the Dragon)

మార్షల్ ఆర్ట్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు లెజెండ్ బ్రూస్ లీ. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఒక ఐలాండ్‌లో జరిగే మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బ్రూస్ లీ వెళ్తాడు. అక్కడ ఒట్టి చేతులతో ఆయన చేసే ఫైట్లు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ నోటి అరుపులు థియేటర్లను ఊపేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అద్దాల గదిలో జరిగే ఫైట్ చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌కి ఒక ఇంటర్నేషనల్ రేంజ్ తెచ్చిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV) లో ఇది రెంట్‌కి దొరుకుతుంది.

2. ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ చైనా (Once Upon a Time in China)

Advertisement

కుంగ్ ఫూ అంటే కొట్టడమే కాదు, అదొక ఆర్ట్ అని నిరూపించిన సినిమా ఇది. ఇందులో యాక్షన్ కింగ్ జెట్ లీ చైనీస్ ఫోక్ హీరో ‘వాంగ్ ఫీ-హంగ్’ పాత్రలో జీవించేశాడు. విదేశీయుల ఆగడాల నుండి తన దేశాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి ఆయన చేసే ఫైట్లు మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా గొడుగుతో చేసే ఫైట్లు, గాల్లో తేలుతూ తన్నే కిక్స్ చూస్తే అప్పట్లో జనాలు పిచ్చెక్కిపోయారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఇదొక విజువల్ వండర్. యూట్యూబ్ మూవీస్ (YouTube Movies), ఆపిల్ టీవీ (Apple TV)లో ఇది అందుబాటులో ఉంది.

3. క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ (Crouching Tiger, Hidden Dragon)

ఈ సినిమా ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టి ప్రపంచాన్నే షేక్ చేసింది. ఇందులో ఫైట్లు ఎలా ఉంటాయంటే.. మనుషులు చెట్ల చిటారు కొమ్మలపై, ఇళ్ల కప్పులపై పక్షిలా తేలుతూ ఫైట్ చేసుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా, స్క్రీన్ మీద చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేము. ఒక పవిత్రమైన కత్తి చుట్టూ తిరిగే కథ ఇది. యాక్షన్ సీన్లలో ఒక రిథమ్, ఒక అందం ఉంటుంది ఇందులో. మార్షల్ ఆర్ట్స్ ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన సినిమాగా చెప్పుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ (Netflix), గూగుల్ ప్లే మూవీస్ లో ఇది అందుబాటులో ఉంది.

4. కిల్ బిల్: వాల్యూమ్ 1 (Kill Bill: Vol. 1)

Advertisement

క్వెంటిన్ టరాంటినో డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఒక వైల్డ్ యాక్షన్ రైడ్. పెళ్లి రోజే తనపై దాడి చేసి, కోమాలోకి పంపిన పాత గ్యాంగ్ మీద పగతీర్చుకునే ఒక మహిళ కథ ఇది. పసుపు రంగు డ్రెస్ వేసుకుని ఉమా థుర్మాన్ కత్తి పట్టుకుని బరిలోకి దిగితే.. శవాల దిబ్బలే. జపనీస్ సమురాయ్ స్టైల్, చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మిక్స్ చేసి రక్తపాతం సృష్టించారు. యాక్షన్ సీన్స్ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో దీనిని చూడవచ్చు.

5. ఐప్ మాన్ (Ip Man)

బ్రూస్ లీకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిన గురువు ‘ఐప్ మాన్’ జీవిత కథ ఇది. డోనీ ఎన్ ఈ పాత్రలో దుమ్ములేపాడు. చైనాను జపాన్ ఆక్రమించినప్పుడు, తన దేశ ప్రజల ఆత్మగౌరవం కోసం ఐప్ మాన్ చేసే ‘వింగ్ చున్’ కుంగ్ ఫూ ఫైట్లు పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఒక్కడే పది మంది జపనీస్ ఫైటర్లను చితక్కొట్టే సీన్ చూస్తే ఎవరికైనా సరే నరాలు బిగుసుకుంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ సిరీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ వచ్చేస్తోందిగా! వెంటనే ఈ సినిమాలను హోమ్ థియేటర్ ఆన్ చేసి దుమ్ములేపండి.

Read Also : ఈత నేర్పిస్తూ అమ్మాయిని బుట్టలో వేసే కుర్రాడు… లవర్స్ చూడాల్సిన చూడచక్కని సినిమా

Tags

Related News

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

Big Stories

Advertisement
×