E-Paper
Advertisement

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్
Advertisement

Comedy Series: తండ్రికి మించిన తనయుడు… దీన్ని ఎక్కువగా ఏదైనా మంచి విషయం, ముఖ్యంగా కొడుకులను పొగడడానికి వాడతాము. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం తండ్రీకొడుకులు ఈగోలో ఒకరిని మించి ఒకరు ఉంటారు. మరి ఆ ఈగో వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నది తెలియాలంటే ‘ది హాక్’ (The Hawk Season 1) సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ కథ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథలో మన హీరో పేరు లాని హాకిన్స్. 2004లో ప్రపంచంలోనే నంబర్ వన్ గోల్ఫ్ క్రీడాకారుడిగా వెలిగిన లాని, తనను తాను “ది హాక్” అని పిలుచుకుంటూ ఉంటాడు. కానీ రానురానూ అతనికి వయసు పైబడుతుంది, దీంతో ఫామ్ పూర్తిగా దెబ్బతింటుంది. అయినా తన కెరీర్ ముగింపు దశలో కూడా తాను ఇంకా స్టార్ ప్లేయర్‌నే అని, కేవలం ఒక్క షాట్‌తో మళ్లీ ప్రపంచాన్ని గెలిచేయగలనని లాని గట్టిగా నమ్ముతుంటాడు.

Advertisement

ఒక చివరి మేజర్ టోర్నమెంట్‌ను గెలవాలనే పిచ్చితో అతను తీవ్రంగా ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో అతని మాజీ భార్య స్టాసీ, అతని కొడుకు లాన్స్ కూడా ఉంటారు. తండ్రిలాగే కొడుకు కూడా అద్భుతమైన ప్రొఫెషనల్ గోల్ఫర్. లాని వల్ల ఎలాంటి నవ్వు తెప్పించే ఇబ్బందులు పడ్డారనేది కథలో ముఖ్యాంశం. లాని తన కొడుకుతో కలిసి టోర్నమెంట్‌లో ఆడేటప్పుడు సృష్టించే హంగామా, అతని మొండి వైఖరి వల్ల వచ్చే ఇబ్బందులు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి.

కామెడీ మాత్రమే కాకుండా, ఒక క్రీడాకారుడు తన వయసును, ఓటమిని ఒప్పుకోవడానికి పడే మానసిక సంఘర్షణను కూడా ఈ సిరీస్‌లో హార్ట్ టచింగ్ గా చూపించారు. మరి లాని తన కుటుంబ సభ్యులను ఎలా గందరగోళంలో పడేస్తాడు? చివరికి తన ఆశయాన్ని సాధించాలని ఎలాంటి ప్రయత్నిస్తాడు ? అనేది సిరీస్‌ ఓ చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

గోల్ఫ్ కోర్టులోని మొండి లెజెండ్ సాహసమే ఈ సిరీస్ స్టోరీ. అతను ఆ కుటుంబంలో సృష్టించే హంగామా, ఒక చివరి గెలుపు కోసం పడే పోరాటం చూసి తీరాల్సిందే. హాలీవుడ్ స్టార్ విల్ ఫెర్రెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్ జూలై 16న Netflixలో విడుదలైంది. తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. మొత్తం 10 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ను స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే ఇందులో కామెడీ కూడా కావలసినంత ఉంది. వీకెండ్ కు మస్ట్ వాచ్.

Read Also: రాజభవనంలోని వాళ్ళని వెంటాడే మిస్టీరియస్ శాపం… క్రేజీ కొరియన్ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×