E-Paper
Advertisement

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా
Advertisement

OTT Movie : కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఫాన్స్‌కి, ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ కథ యున్-యి అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక ఇంటికి పనిమానిషిగా వెళ్ళి ప్రెగ్నెంట్ గా మారుతుంది. ఆ తరువాత స్టోరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘The Housemaid’ 2010లో విడుదలైన దక్షిణ కొరియా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. దీనిని ఇమ్ సాంగ్ సూ డైరెక్ట్ చేశారు. ఇది 1960లో కిమ్ కి-యంగ్ డైరెక్ట్ చేసిన అదే పేరుతో ఉన్న క్లాసిక్ చిత్రానికి రీమేక్. ఇందులో జియోన్ డో-యియోన్ (యున్-యి), లీ జంగ్-జే (హూన్), యూన్ యియో-జంగ్ (బ్యాంగ్-సిక్), సియో వూ (హే-రా) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 47 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2010 మే 13న దక్షిణ కొరియాలో 679 స్క్రీన్‌లలో విడుదలై, మంచి ఓపెనింగ్స్ సాధించింది. ప్రస్తుతం Amazon Prime Video, Netflix, Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమా ఒక బిజీ సిటీ స్ట్రీట్‌లో ఒక యువతి బిల్డింగ్ నుండి జంప్ చేసి సూసైడ్ చేసుకోవడంతో మొదలవుతుంది. యున్-యి అనే ఒక రెస్టారెంట్ వర్కర్, ఈ సీన్‌ను చూసి డిస్టర్బ్ అవుతుంది. తర్వాత బ్యాంగ్-సిక్ అనే వృద్ధ మహిళ యున్-యిని కలిసి, ఒక ధనవంత కుటుంబంలో పనిమనిషిగా జాబ్ ఆఫర్ చేస్తుంది. హూన్ అతని గర్భవతి భార్య హే-రా ఉన్న ఒక లగ్జరీ మాన్షన్‌లో యున్-యి నానీగా జాయిన్ అవుతుంది. వాళ్ల చిన్న కూతురు నమీని చూసుకోవడం ఆమె పని. హూన్ ఒక సెడక్టివ్ బిజినెస్‌మాన్. యున్-యితో ఫ్లర్ట్ చేస్తాడు. వైన్, పియానోతో ఆమెను సెడ్యూస్ చేయడంతో, వాళ్ల మధ్య ఒక అఫైర్ స్టార్ట్ అవుతుంది. యున్-యి ఒక సాధారణ అమ్మాయి. ఈ అఫైర్‌లో ప్యాసివ్‌గా ఉంటుంది.

ఈ అఫైర్ వల్ల యున్-యి కూడా గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని హే-రా తల్లికి బ్యాంగ్-సిక్ చెప్పేస్తుంది. హే-రా, ఆమె తల్లి, బ్యాంగ్-సిక్ యున్-యిపై క్రూరంగా రియాక్ట్ అవుతారు. హే-రా తల్లి యున్-యిని మర్డర్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఆమెను బలవంతంగా అబార్షన్ చేయిస్తుంది. ఆ తర్వాత యున్-యి డిప్రెషన్‌లోకి వెళ్తుంది. కానీ ఆమె లోపల రివెంజ్ ఫీలింగ్ మొదలవుతుంది. ఆమె తిరిగి మాన్షన్‌కు వచ్చి తన పని మొదలుపెడుతుంది. ఈ కథ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. యున్-యి తన రివేంజ్ ని ఎలా తీర్చుకుంటుంది ? ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రధాన మంత్రితో సీక్రెట్ రిలేషన్… ఒక్క క్లిక్ తో డేంజర్ లో తల్లీ కూతుర్లు… నిమిషానికో ట్విస్ట్

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×