OTT Movie : ఓటీటీలోకి ఎన్నో రకాల స్టోరీలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. వీటిలో థ్రిల్లర్ సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఒక ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక రిమోట్ కార్ ను హైజాక్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. అందులో ప్రైమ్ మినిస్టర్ కూతురు ఉండటంతో స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Control’ బ్రిటిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనిని జీన్ ఫల్లైజ్ డైరెక్ట్ చేశారు. ఇందులో లారెన్ మెట్‌కాల్ఫ్ (స్టెల్లా సిమన్స్), మార్క్ హాంప్టన్ (ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ ఆడమ్స్), కెవిన్ స్పేసీ (వాయిస్ రోల్‌లో) ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 24 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, 2023 డిసెంబర్ 15న USA, UKలో థియేట్రికల్ రిలీజ్ అయింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యూబీలో స్ట్రీమింగ్ అయింది.
ఈ కథ లండన్‌లో బ్రిటిష్ హోమ్ సెక్రటరీ స్టెల్లా సిమన్స్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ ఆడమ్స్ తో సీక్రెట్ అఫైర్‌లో ఉంటుంది. ఒక రాత్రి, డేవిడ్ ఒక పొలిటికల్ ఈవెంట్‌లో బిజీగా ఉండటంతో, స్టెల్లా అతని టీనేజ్ కూతురు సారాను ఇంటికి తీసుకెళ్లేందుకు తన సెల్ఫ్-డ్రైవింగ్ కారును ఉపయోగిస్తుంది. కానీ కారు రూట్‌లో ఉన్నప్పుడు, ఒక మిస్టీరియస్ వాయిస్ కారును రిమోట్‌గా హైజాక్ చేస్తాడు. స్టెల్లా, సారాను లండన్ వీధుల్లో ఒక డేంజరస్ రాంపేజ్‌కు గురిచేస్తాడు. కారు స్టెల్లా కంట్రోల్‌లో లేకపోవడంతో, ఆమె దాన్ని ఆపలేక, రూట్ మార్చలేక, పానిక్‌లో ఉంటుంది.
కిడ్నాపర్ ఆమెను మానసికంగా టార్చర్ చేస్తాడు. స్టెల్లా కారులోనే ట్రాప్ అయి, సారా అపస్మారక స్థితిలో ఉండటంతో, ఆమె ఈ వాయిస్ ఎవరు, అతను ఏం కోరుకుంటున్నాడు అని గుర్తించే ప్రయత్నంలో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. కిడ్నాపర్ స్టెల్లా గతంలో చేసిన ఒక నిర్ణయం గురించి హింట్స్ ఇస్తాడు. అది ఒక డేటా-షేరింగ్ పాలసీకి సంబంధించిన రాజకీయ స్కాండల్. అది సామాన్య ప్రజల జీవితాలను దెబ్బతీసింది. ఈ వాయిస్ ఒక మాజీ గవర్నమెంట్ ఎంప్లాయీగా, స్టెల్లా, డేవిడ్‌ల రాజకీయ అవినీతి వల్ల తన జీవితం నాశనమైందని చెప్పి, ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు.
కారు లండన్ వీధుల్లో వేగంగా పరిగెడుతూ, ట్రాఫిక్‌ను ఢీకొడుతూ, పోలీస్‌లకు సవాల్ గా మారుతుంది. కానీ సెల్ఫ్-డ్రైవింగ్ టెక్నాలజీ వల్ల ఎవరూ దాన్ని ఆపలేకపోతారు. స్టెల్లా తన అఫైర్ బయటపడటం వల్ల రాజకీయ కెరీర్, పర్సనల్ లైఫ్ కోల్పోతానని భయపడుతుంది. అదే సమయంలో సారాను కాపాడేందుకు ట్రై చేస్తుంది. క్లైమాక్స్‌లో అతని ఐడెంటిటీ రివీల్ అయ్యే ట్విస్ట్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంది. చివరికి ఈ కిడ్నాపర్ ఎవరు ? స్టెల్లా, సారాను కాపాడుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఇల్లీగల్ గా పోలీసయ్యే క్రిమినల్… గిలిగింతలు పెట్టే ట్విస్టులు… ఓటీటీలోకి తమిళ సిరీస్ ఎంట్రీ