Charlapalli Incident: హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గన్నీ బ్యాగ్‌లో మహిళా మృతదేహం కేసులో పురోగతి లభించింది. ఈ దారుణ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం తెలిసిందే. చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద ఆటో స్టాండ్ సమీపంలో ఒక అనామక మహిళా మృతదేహం గన్నీ బ్యాగ్‌లో ప్రయాణికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి వచ్చిన దారుణమైన దుర్వాసనను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు బ్యాగ్‌ను తెరిచి చూసేసరికి, చేతులు, కాళ్లు కట్టబడిన, ఎర్రటి చీర ధరించిన 30 నుంచి 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. డీకంపోజ్డ్ స్థితిలో ఉన్న శవంపై గాయాల గుర్తులు కనిపించాయి. దీని ఆధారంగా హత్య కేసుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తక్షణమే ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. రాచకొండ పోలీస్ అధికారులు ఈ కేసును లోతుగా విచారించారు. శవాన్ని గాంధీ హాస్పిటల్‌కు పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ ఎక్స్‌పర్టులు స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్కాన్ చేస్తూ, బ్యాగ్‌ను ఆటోలో తీసుకొచ్చి వదిలేసిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట్లో గుర్తించలేకపోయినా, పోలీసులు మహిళల మిస్సింగ్ కేసులు, లోకల్ రికార్డులను చెక్ చేశారు.
ఈ రోజు ఈ కేసుకు సంబంధించి పురోగతి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రమీల అనే మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె చందాగిరి, కొండాపూర్‌లో యువకుడు హత్య చేశాడని తెలిపారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం ఏర్పడింది. కొండాపూర్ ప్రాంతంలో యువకుడితో కలిసి ప్రమీల ఉంటున్నట్టు చెప్పారు. ఆ యువకుడే ప్రమీలను చంపి మూటలో వేసుకొని చర్లపల్లి స్టేషన్ కు వచ్చినట్టు తెలిపారు.
ఆటోలోనే మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొని వచ్చి చర్లప్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పడేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం కు వెళ్లే ట్రైన్ ఎక్కాడని చెప్పారు. హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యం అయినట్టు పోలీసుల పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి అస్సాంకు వెళ్లారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ప్రకార.., గొంతు కోసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన
ఈ కేసు హైదరాబాద్‌లో మహిళలపై జరుగుతున్న హింసకు ఒక ఉదాహరణగా మారింది. పోలీసులు స్థానికంగా భద్రత పెంచారు. ప్రమీల కుటుంబం బెంగాల్‌లో ఉంది, వారు హైదరాబాద్‌కు వచ్చి శవాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఈ ఘటన సమాజంలో ఆందోళన సృష్టించింది, మహిళల భద్రతపై చర్చలు జరుగుతున్నాయి. పోలీసులు త్వరలో ఆరోపితుడిని అరెస్ట్ చేసి న్యాయం చేస్తారని ఆశ.