సాధారణంగా దాహమేస్తే మంచి నీళ్లు తాగుతాం. రోజూ ఒక్కో మనిషి సుమారు 5 లీటర్ల వరకు నీళ్లు తాగే ప్రయత్నం చేస్తారు. కానీ, కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి మూడు దశాబ్దాలుగా అస్సలు మంచి నీళ్లు తాగడం లేదు. వాటర్ కు బదులుగా అతడి ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాడట. ఆయనను స్థానికులు ఏకంగా ఆయిల్ కుమార్ అని పిలిచేస్తున్నారట. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఆయన, రోజూ ఏకంగా 7 నుంచి 8 లీటర్ల ఆయిల్ తాగుతున్నాడట. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు కూడా రాలేదట. డాక్టర్లు కూడా ఆయన ఆయిల్ అలవాటు గురించి కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.
వాస్తవానికి ఇంజిన్ ఆయిల్ అనేది అత్యంత విషపూరితమైనది అంటున్నారు వైద్యులు. “క్యాన్సర్ కారకాలు విపరీతంగా ఉంటాయి. తక్షణం, దీర్ఘకాలిక ప్రమాదాలకు కారణమయ్యే అనేక విష కారకాలు ఉంటాయి. ఆయిల్ ను ఎలా తీసుకున్నా ప్రమాదకరమే. ఒకవేళ ఇంజిన్ ఊపిరితిత్తులలోకి వస్తే వెంటనే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ లోని పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు తీవ్రమైన క్యాన్సర్ కారకాలు. ఇందులో అల్యూమినియం, ఇనుము, రాగి, సీసం లాంటి మూలకాలు ఇంజిన్ ఆయిల్ లో భారీగా ఉంటాయి. జింక్ డయల్ కైల్డిథియోఫాస్ఫేట్, కాల్షియం ఆల్కైల్ ఫినేట్లు, మెగ్నీషియం సల్ఫోనేట్లు కాలేయం, నాడీ వ్యవస్థను నాశనం చేస్తాయి. మసి, కార్బన్ కణాలు, మండించని ఇంధన అవశేషాలు బాడీని విషపూరితం చేస్తాయి” అంటున్నారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకారం ఇంజిన్ ఆయిల్ శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.
⦿ క్యాన్సర్: ఇంజిన్ ఆయిల్ లోని చాలా సమ్మేళనాలు క్యాన్సర్ కారకాలు. ఇవి చర్మం, కాలేయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
⦿ న్యూరోలాజికల్ నష్టం: ఆయిల్ లోని ట్రైక్రెసిల్ ఫాస్ఫేట్లు నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. ఇది నాడీ కండరాల సమస్యలకు దారితీస్తుంది.
⦿ పునరుత్పత్తి సమస్యలు: ఆయిల్ లోని ప్రమాదకర సమ్మేళనాలు పునరుత్పత్తి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వంధ్యత్వ సమస్యకు కారణం అవుతుంది.
⦿ ఆర్గాన్ ఫెయిల్యూర్: భారీ లోహాలు, ఇతర కలుషితాలు ఆర్గాన్ ఫెయిల్యూర్ కు కారణం అవుతాయి.
⦿ శ్వాసకోశ సమస్యలు: ఇంజిన్ ఆయిల్ కారణంగా ఊపిరితిత్తుల కణజాలం నాశనం అవుతుంది.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంజిన్ ఆయిల్ కారణంగా శరీరం ఎన్నో ఇబ్బందులకు ఇబ్బందులకు గురవుతుంది. దృష్టి కోల్పోవడం, గొంతులో నొప్పి, ముక్కు, కళ్ళు, చెవులు, పెదవులు, నాలుక నొప్పి, కడుపు నొప్పి, మలంలో రక్తం, విరేచనాలు, వాంతులు, వికారం, లో బీపీ, శ్వాస తీసుకోకపోవడం, మైకము, మగత, శరీరమంతా మండుతున్న అనుభూతి కలుగుతుంది.
Read Also: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!